అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదంటే.. త‌ర్వాత సీటు లేన‌ట్టే!!

Update: 2022-03-18 02:30 GMT
ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇదే చ‌ర్చ సాగుతోంది. ముఖ్య‌మంత్రి క‌నుక ఈ ఏడాది జూలై (మూడు నెల‌లు మాత్ర‌మే ఉంది)లోపు.. అప్పాయింట్ ఇవ్వ‌క‌పోతే.. స‌ద‌రు ఎమ్మెల్యేకు ఇక‌, వ‌చ్చే ఎన్నిక ల్లో టికెట్ క‌ట్టేన‌ని.. అంటున్నారు. ఈ విష‌యం  పార్టీ నేత‌ల మ‌ధ్య పెద్ద‌గానే వినిపిస్తుండ‌డం విశేషం. విషయంలోకి వెళ్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కేడ‌ర్ ను  కూడా ప‌ట్టించుకోలేదు. అయితే.. ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిణామాలు.. అధికార పార్టీలో గుబులు రేపుతు న్నాయి. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేల‌తో అధిష్టానం భేటీల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ..ఎమ్మెల్యేల‌తో మాట్లాడాల‌ని ..సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే  వైసీపీ ప్లీన‌రీలోపు ఎమ్మెల్యేల‌తో సీఎం మాట్లాడ‌తార‌ని.. అంద‌రూ అనుకుంటున్నారు. ఒక‌వేళ‌.. ఆ స‌మ‌యానికి ఎవ‌రితో అయినా.. మాట్లాడ‌లేదంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌ద‌రు నేత‌ల‌కు సీటు లేన‌ట్టే! అని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంద‌ట. వాస్త‌వానికి గ‌త మూడేళ్ల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు.. ఒక్క‌సారి కంటే.. ఎక్కువ‌గా ముఖ్య‌మంత్రిని క‌లిసింది లేద‌ట‌. అయితే.. సీఎంను క‌లిసే స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందో అని.. ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే... వైసీపీ అధికారంలోకి వ‌చ్చేసి మూడేళ్లు అయిపోతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. క‌నీసం ర‌హ‌దారుల నిర్మాణాలు కూడా లేవు. ఇదే స‌మ‌యంలో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు మ‌ధ్య వివాదాలు.. విభేదాలు జోరుగా సాగుతున్నా యి. ఈ నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించాల‌ని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ కార‌ణాల‌తో తాము ప్ర‌జ‌ల మ‌ధ్య అస్స‌లు ఉండ‌లేక పోతున్నామ‌ని.. జ‌నాల్లోకి వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని కూడా వారు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

పోనీ.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమం ఏమైనా.. త‌మ‌కు ప్ల‌స్‌గా ఉందా.. అంటే.. అది కూడా లేద‌ని ఎక్కువ‌మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నార‌ట‌. సంక్షేమం అందిన వారు ఆనందంగానే ఉన్నా.. అంద‌ని వారు మాత్రం ప్ర‌భుత్వంపై గుస్సాగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలోకి అడుగు పెడితే... ఇలాంటి వారికి ఏం చెప్పాల‌నే విష‌యం.. ఎమ్మెల్యేల్లో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌గా మారింది. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రిని ప్ర‌సన‌న్నం చేసుకుని.. నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగే ప‌రిస్థితి తెచ్చుకోవాల‌ని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రిని క‌లిసేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ముఖ్య‌మంత్రి వైపు నుంచి అప్పాయింట్‌మెంట్ ఇచ్చి.. ఎమ్మెల్యేల‌తో చ‌ర్చించేందుకు రెడీ అవుతున్నారు. ఒక‌వేళ ఎవ‌రికైనా..జూలై లోపు.. అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోతే.. వాళ్ల‌కు ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌దేమో.. అంటున్నా రు.  మ‌రి ఏం జ‌రుగుతుందో .. ఎంత‌మందికి అప్పాయింట్‌మెంట్ ఇస్తారో చూడాలని వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News