మార్గదర్శి కేసు పై ఏపీ సీఐడీ లేటెస్ట్ అప్ డేట్!

Update: 2023-06-07 17:31 GMT
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు లో మంగళవారం ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ ఇంటి కి సీఐడీ బృందం వెళ్లి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే విచారణ తర్వాత ఈటీవీ లో పలు కథనాలు ప్రసారమయ్యాయి. ఈనాడు దినపత్రిక లో కూడా సీఐడీ తీరు ని తప్పుబడుతున్నట్లుగా అనేక కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయాల పై ఏపీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ స్పందించారు.

మార్గదర్శి కేసు లో చట్టానికి లోబడే దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరి పైనా తప్పుడు ఆరోపణల తో కేసులు పెట్ట లేదని, ఎవరి నీ విచారణ పేరు తో వేధించడంలేద ని ఏపీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ స్పష్టం చేశారు! తప్పుడు ఆరోపణల తో కేసులు పెట్టారని, విచారణ పేరు తో వేధించారని సీఐడీ పై కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.

ఇదే విషయాల పై మరింత పందించిన ఆయన... మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయ ని తెలిపిన ఆయన... చట్టం పరిధి లోనే విచారణ జరుపుతున్నామని వివరణ ఇచ్చుకున్నారు.

ఇక రోజంతా విచారణ చేపట్టి కేవలం 8 ప్రశ్నలే అడిగారనే ఆరోపణల పైనా సీఐడీ అడిషనల్ ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. కేవలం 25 శాతం ప్రశ్నల కు మాత్రమే శైలజా కిరణ్ జవాబు చెప్పారని.. కొన్ని ప్రశ్నల కు ఎండీ శైలజా కిరణ్ సమాధానాలు చెప్పలేదని రవికుమార్ తెలిపారు. విచారణకు వెళ్లిన ప్రతిసారి వంకలు పెట్టి ఆలస్యం చేస్తున్నారని, దీంతో మరోసారి శైలజా కిరణ్ ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.
Read more!

కాగా, "మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్‌ ఫండ్‌ పై తప్పుడు ఆరోపణల తో కేసులు పెట్టి కొంతకాలంగా వేధిస్తున్న సీఐడీ.. మరోమారు విచారణ పేరు తో హడావుడి చేసింది. సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ ను మంగళవారం సుమారు ఏడు గంటలపాటు విచారించింది. వేధింపులే లక్ష్యంగా సీఐడీ అధికారుల తీరు ఉన్నట్లు కనిపించింది" అంటూ "మార్గదర్శిని దెబ్బతీయడమే అసలు లక్ష్యం" అని ఈనాడు లో ప్రముఖంగా వార్త ప్రచురిత మైన సంగతి తెలిసిందే!

Similar News