ఏపీ బీజేపీ ఘాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర నాయకులతోపాటు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తే వారిపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇక ప్రచారం చేసే వారిలో ఉద్యోగులున్నా సరే వారి సంస్థలతోపాటు బ్యాంకులను కూడా సస్పెండ్ చేయాలని కోరుతామని హెచ్చరించింది. విదేశాల్లో ఉండి ప్రచారం చేసే సంబంధిత ఇండియన్ ఎంబసీకి సమాచారం పంపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
చంద్రబాబు, లోకేష్ లు రూ.లక్షలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరో ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్ సైట్ లు, సామాజిక మాధ్యమాల పేరుతో ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ధైర్యముంటే అధికారిక వెబ్ సైట్, మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సవాల్ చేశారు.