ఏటీఎం.. అంటే ఎనీటైమ్​ మిల్క్​..! హైదరాబాద్ ​లో ప్రారంభం

Update: 2020-10-24 09:50 GMT
ఏటీఎం అంటే ఎనీటైం మనీ కాదు.. ఎనీటైం మిల్క్​. హైదరాబాద్​లో తొలిసారిగా పాలు వచ్చే ఈ ఏటీఎం మిషన్​ ప్రారంభించారు. పాల కోసం పట్టణాల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనకు దగ్గర్లోకి కిరాణా షాప్​ల్లో పాలు దొరకక కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు హైదరబాద్​ లో పాల ఇబ్బందులను తగ్గించేందుకు ఏటీఎం(ఎనీటైం మిల్క్​) లను ఏర్పాటు చేయబోతున్నారు. గీతా డెయిరీ  ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఎల్బీనగర్​లో తొలిసారిగా ఈ ఏటీఎంను ప్రారంభించారు. దాని మీద ఉన్న లీటర్​, అర లీటర్​ బటన్​ నొక్కి.. అవసరమైన డబ్బులు వేయగానే పాలు బయటకు వస్తాయి.

అయితే ప్రస్తుతం ఎల్బీనగర్​లో ఈ మిషన్​ను ప్రారంభించామని.. ఇక్కడ సక్సెస్​ అయితే నగరమంతా విస్తరిస్తామని గీతా డైరీ నిర్వాహకులు తెలిపారు. మార్కెట్​ ధరల ప్రకారమే పాలను విక్రయిస్తున్నామని చెప్పారు. పాలు నాణ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ మిషన్​లో పాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కొన్ని చిన్న చితకా సంస్థలు సరైన క్వాలిటీ పాలు ప్యాకింగ్ చేసి విక్రయిస్తుంటాయి. త్వరగా కూడా చెడిపోతుంటాయి.  ఇక చిల్లర దుకాణాల్లో రాత్రి మిగిలిన పాల ప్యాకెట్లు పొద్దున, పొద్దున మిగిలినవి సాయంత్రం విక్రయిస్తుంటారు.  అవి కొని నష్ట పోతుంటాం. ఇలాంటి ఏటిఎం పాల మిషన్ లు అందుబాటులోకి వస్తే ఈ బాధ లేవి పడకుండా తాజాగా పాలు పొందొచ్చు.
Tags:    

Similar News