శిరోముండనం... ఏపీలో మరో సంచలనం

Update: 2020-10-04 17:35 GMT
నూతన్ నాయుడి కుటుంబం ఒక దళతి యువకుడికి శిరోముండనం చేయించిన కేసు ఎంత వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే. తాజాగా ఏపీలో అలాంటి మరో విచారకరమైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలో జరిగిన ఈ ఘటనలో అప్పు తీర్చలేదన్న కారణంతో ఒక యువకుడికి గుండుకొట్టించారు.

ఒక యువకుడు తమ వద్ద తీసుకున్న 30 వేలు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇది మూడో ఘటన. ఒకటి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, రెండోది విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగాయి. మూడోది జంగారెడ్డి గూడెంలో తాజాగా జరిగింది. నిందితుడికి ఈ ఘటనలో నలుగురు సహకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా వెలుగుచూడలేదు.
Tags:    

Similar News