ఏపీలో కంటైన్మెంట్ జోన్ గా మరో నగరం..అమల్లోకి కఠిన ఆంక్షలు !
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని నగరాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీనితో కరోనా కట్టడి కోసం విధించే కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతుంది. తాజాగా శ్రీకాకుళం మొత్తం కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నగరంలో 30 శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం నుంచి 14 రోజులపాటు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
వచ్చే 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకునే దిశలో చర్యలు చేపడుతోంది. తొలి విడతలో కూడా పోలీసు శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన రెండు రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా ఎస్పీ నుంచి ఏఎస్పీలు, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ గస్తీని పరిశీలిస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం 3,081 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 906 మందికి వైరస్ తేలింది. వారం రోజులుగా నిత్యం వెయ్యికి పైగానే కేసులు నమోదవుతూ వచ్చాయి. ఆసుపత్రుల్లో 1,264 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.