రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు బాలు విగ్రహం
ఇదిలా ఉంటే ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులో మీద రవీంద్ర భారతిలోని ప్రాంగణంలో ఎస్పీబీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నరు.;
దేశం గర్వించదగిన దిగ్గజ గాయకుడు పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక మీదట విగ్రహ రూపంలో భాగ్యనగర వాసులను అలరించనున్నారు, పలకరించనున్నారు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఐకానిక్ కల్చరల్ సెంటర్ లో ఎస్పీబీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం మీద ఈ ఏడాది జూన్ లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవ కానీ ఆయన పట్టుదల కృషి కానీ ఎప్పటికీ స్పూర్తి దాయకం అన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకు గౌరవంగా ఈ నిర్ణయాన్ని తెలంగాణా ప్రభుత్వం తీసుకుంది. అంతే కాదు రానున్న తరాలు కూడా ఎస్పీబీకి ఘన నివాళి అర్పించడానికి వీలుగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు
కొంత రాద్ధాంతం :
బాలు విగ్రహం రవీంద్ర భారతి వద్ద ఏర్పాటు చేస్తారని ప్రకటించగానే కొంతమంది అప్రకటిత తెలంగాణా కార్యకర్తలు దానిని వ్యతిరేకించారు. కొన్ని రోజుల క్రితం దీని మీద వారు ఎస్పీబీ బంధువు అయిన నటుడు శుభలేఖ సుధాకర్ తో వాగ్వాదానికి కూడా దిగారు ఎస్పీబీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం అని వారు వాదించారు. ఈ విషయం కొంత గందరగోళం కూడా సృష్టించింది. అయితే తెలంగాణా ప్రభుత్వం తో పాటు అంతా బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉండడమే కాకుండా ఆయనను తెలుగు వెలుగుగా చూడడం శుభ పరిణామంగా అంతా అంటున్నారు.
రేవంత్ చేతుల మీదుగా :
ఇదిలా ఉంటే ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులో మీద రవీంద్ర భారతిలోని ప్రాంగణంలో ఎస్పీబీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నరు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ తో పాటు ఎస్పీబీ బంధువు నటుడు అయిన శుభలేఖ సుధాకర్ చేసిన విన్నపాన్ని మన్నించి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు అంతే కాదు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా మరో అతిథిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఇక తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇతర ప్రముఖుకు అంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
సంగీత ప్రముఖులతో :
ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సంగీత ప్రముఖులతో అలరించనుంది దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గాయకులలో ఒకరుగా ఉన్న బాలుకు ఎంతో మంది ప్రముఖులు నివాళులు అర్పిస్తారు. టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ థమన్, అదే విధంగా ఇతర ప్రముఖ గాయకులు, ఎస్పీబీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇదిలా ఉండగా తెలంగాణా ప్రభుత్వమే ముందుకు వచ్చి బాలు విగ్రహావిష్కరణలో పాల్గొనడంతో కొంతమంది ప్రాంతీయ వాదం పేరుతో ఆందోళన చేస్తూ సాగించిన ఈ అనవసరమైన వివాదానికి పూర్తి స్థాయిలో ముగింపు పలికినట్లు అయింది అని అంటున్నారు.