అమెరికాలో పోలిసుల చేతుల్లో హతమైన మరో నల్లజాతీయుడు

Update: 2020-10-28 13:50 GMT
నల్లజాతీయుడి హత్యతో రగిలిపోతున్న అమెరికాలో మరో నల్లజాతీయుడిని హత్య చేయడంతో మరింత రాజుకుంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ మనల్లజాతీయుడిని అమెరికా పోలీసులు హతమార్చిన తర్వాత , అమెరికా అట్టుడికిపోయింది. అమెరికానే కాకుండా ప్రపంచదేశాల్లోనూ ఈ ఘటన పై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనను ఇంకా తేరుకోక  ముందే అమెరికాలో మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. పెన్సిల్‌ వేనియా లోని ఫిలాడెల్ఫియా లో వాల్టర్ వాలస్ అనే నల్ల జాతీయుడిని పోలీసులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనితో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాల్టర్ వాలస్ హత్యను ఖండిస్తూ అనేక మంది రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్లకు, పోలీస్ కార్లకు, దుకాణాలకు నిప్పంటిస్తున్నారు. ఆ దాడుల్లో  ఇప్పటివరకు 30 మందికి పైగా పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనితో పలువురు ఆందోళన కారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫిలాడెల్ఫియాలోని లోకస్ట్ స్ట్రీట్ ‌లో ఓ వ్యక్తి ఆయుధంతో తిరుగుతున్నాడంటూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చేతిలో కత్తితో ఉన్న వాల్టర్‌ను గమనించారు. కత్తి కింద పడేయమంటూ హెచ్చరించారు. వాల్టర్ వాలస్ కత్తిని కింద పడేయకపోవడంతో.. ఇద్దరు పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నల్ల జాతీయుడు వాల్టర్ వాలస్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే స్థానికులు రోడ్డెక్కి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సోమవారం సాయంత్రం నుంచి ఫిలాడెల్ఫియాలో పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం అర్థరాత్రికి ఈ నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఫిలాడెల్ఫియా పోలీస్ కమిషనర్ డేనియల్ ఔట్లా తెలిపారు. ఘటనకు చెందిన వీడియోను చూస్తుంటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు
Tags:    

Similar News