ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ... జరిమానా ఎంతంటే ?
కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు రాష్ట్ర హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చోవాలని.. అలాగే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలంటూ హైకోర్టు శిక్ష విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీచేసింది.
అయితే , అయన కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశం అసెంబ్లీ చట్టాలు కాదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలం అయినందుకు కోర్టు ధిక్కరణ కింద భావించిన న్యాయస్థానం ఆయనకు శిక్ష వేసింది. 2017లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకపోవడం పై తాజాగా హైకోర్టు కోర్టు ధిక్కరణ శిక్ష విధించింది. అప్పట్లో కోర్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. కానీ దాన్ని అమలు చేయలేదు బాలకృష్ణమాచార్యులు. అయితే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో వారు మళ్లీ కోర్టుకెళ్లారు. చివరికి కోర్టు ధిక్కరణ కేసు నమోదయింది. ఈయన ఎప్పుడో రిటైరయ్యారు. ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన స్థానంలో వేరే వ్యక్తి అసెంబ్లీ కార్యదర్శిగా ఉంటే.. ఈ శిక్ష ఆయనే అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బాలకృష్ణమాచార్యులు అనుభవించారు.
వాస్తవానికి అసెంబ్లీ కార్యదర్శికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే... తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెసులుబాటు కల్పించాలని బాలకృష్ణమాచార్యులు కోర్టుకు విన్నవించుకున్నారు. భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో మరింత జాగ్రత్త వహిస్తానని హామీ ఇచ్చారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మానవతాదృక్పథంతో తీర్పును సవరించారు.