చిక్కు ప్రశ్న: అనార్కలి సలీం ప్రేమికురాలా? అక్బర్ భార్యా?
అనార్కలి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఏ చరిత్రకారుడు చెబుతారు? మొఘలుల కాలానికి చెందిన ఈ అందమైన యువరాణి ఇప్పటి వరకు మనలో చాలా మందికి ప్రిన్స్ సలీం స్నేహితురాలుగా మాత్రమే తెలుసు. సలీం - అనార్కలి ప్రేమకథపై సినిమాల నుండి చరిత్ర పుస్తకాల వరకు చాలా ఆధారాలున్నాయి. అలాగే అక్బర్ చక్రవర్తి తన పెద్ద కొడుకు సలీం అనార్కలితో ప్రేమాయణం విషయంలో కలత చెందాడు. నిరంతరం అసంతృప్తితో రగిలిపోయాడు. అతను కోపంతో అనార్కలిని గోడకేసి కొట్టాడు. కాలగమనంలో ప్రిన్స్ సలీం `జహంగీర్`గా ప్రసిద్ధి చెందాడు.
అనార్కలి- సలీమ్ ల ప్రేమకథను చిరస్థాయిగా మార్చడంలో ఆసిఫ్ సినిమా `మొఘల్-ఏ-ఆజం` ప్రధాన పాత్ర పోషించింది. అయితే జీ5లో ఇటీవల విడుదలైన `తాజ్: డివైడెడ్ బై బ్లడ్` వెబ్ సిరీస్ చూసి చాలా మంది అనార్కలి ఎవరు అని తికమకపడుతున్నారు. యువరాజు సలీం ప్రేమలో పడిన ఆమె అంతఃపురంలో ఉంపుడుగత్తెనా? లేక ఆమె అక్బర్ చక్రవర్తి భార్యనా? ఆమెకు దనియాల్ అనే కొడుకు పుట్టారా? అంటూ నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర పుస్తకాలలో అనార్కలి గురించి చాలా విషయాలు ఉన్నా కానీ.. ఇంతకీ అనార్కలి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఈ సిరీస్ తీశాక.
అనార్కలి-సలీం.. మొఘలుల చర్చ లేకుండా భారతదేశ చరిత్ర అసంపూర్ణం. ఈ దేశాన్ని స్థిరపరచడంలో అందంగా తీర్చిదిద్దడంలో మొఘలులదే పెద్ద హస్తం. భారతదేశంలో మొఘల్ సుల్తానేట్ కు పునాది వేసిన బాబర్ దోచుకోవడానికి ఇక్కడకు రాలేదని స్థిరపడటానికి వచ్చారని చరిత్ర పుటలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఇంకా అక్బర్ చక్రవర్తి అటువంటి గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నారు. అతను రాజ్ పుత్ జోధాబాయిని వివాహం చేసుకోవడమే కాకుండా.. హిందూ-ముస్లిం-క్రిస్టియన్ అన్ని మతాలకు సమాన హక్కులున్నాయని సూచించాడు. కానీ ఎన్ని చేసినా అనార్కలి విషయంలో ఎందుకు అలా ప్రవర్తించారు? అనేది చరిత్ర పరిశీలకులకు మింగుడుపడని విషయం. అనార్కలి అందం.. ఆమె నృత్యం .. ముగింపు గురించి పలువురు చరిత్రకారులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఆసక్తికరంగా అనార్కలి జీవితం ఒక రహస్యం లాంటిది. ఇది ఎప్పటికీ డీకోడ్ చేయలేనిది.. బహుశా అక్బర్ చక్రవర్తి ఎప్పుడూ అనార్కలిని ప్రపంచం నుండి దాచిపెట్టాలని కోరుకోవడం దీనికి కారణం కావచ్చు.
పాకిస్థాన్ లో అనార్కలి సమాధి
అనార్కలి సమాధి ఎక్కడ ఉంది? అంటే పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో తాజ్ మహల్ లాంటి సమాధి తనదేనని ప్రాచుర్యంలో ఉంది. దీనిని అనార్కలి సమాధి అని పిలుస్తారు. జహంగీర్ రాజుగా సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ప్రిన్స్ సలీం ఈ సమాధిని నిర్మించాడని చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఆమె కల్పిత పాత్ర కాదని అనార్కలి గురించి ఆధారం ఇది.
సినిమాలు సిరీస్ లలో అనార్కలిపై భిన్న కథలు
సినిమాలకు భిన్నంగా వెబ్ సిరీస్ లలో అనార్కలి పాత్రను డిజైన్ చేయడంతో పెద్ద చిక్కొచ్చి పడుతోంది. ఒక్కొక్క దర్శకుడు అనార్కలిని ఒక్కో కోణంలో చూపిస్తున్నారు. `తాజ్: డివైడెడ్ బై బ్లడ్` వెబ్ సిరీస్ లో అనార్కలి పాత్రను అదితి రావ్ హైదరీ పోషించారు. ఈ పాత్రను ఆసిఫ్ `ముఘల్-ఏ-ఆజం`లో హసీన్ మధుబాల పోషించారు. `మొఘల్-ఏ-ఆజం` చిత్రంలో అనార్కలిని గోడకు గొడ్డులా కొట్టినట్లు చూపించలేదన్నది ఇక్కడ ప్రత్యేకంగా స్ఫురణకు తేవాలి. సినిమా క్లైమాక్స్ లో చక్రవర్తి దాడి నుంచి అనార్కలి రక్షించబడుతుంది. ప్రిన్స్ సలీం- అనార్కలిని ఒక సొరంగం ద్వారా ప్యాలెస్ నుండి బయటకు పంపినట్టు చూపించారు. సినిమా స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ముగింపు(క్లైమాక్స్) బాధాకరంగా ఉండకూడదని .. ప్రేక్షకులు తట్టుకోలేరని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని చరిత్ర తెలిసినవారు అంటారు. ఇప్పుడు వెబ్ సిరీస్ వ్యవహారంలోకి వెళితే.. అనార్కలి అసలు కథలో వాస్తవం వేరుగా ఉంది.
అనార్కలి వలసదారు...
అనార్కలి అసలు పేరు నాదిరా బేగం. ఇరాన్ నుండి వలస వచ్చిన నర్తకి. అక్బర్ ఆమెకు అనార్కలి అని పేరు పెట్టారు. కొందరు చరిత్రకారులు షర్ఫున్నీసా అని కూడా పిలుస్తారని రాసారు. ఆమె ఇరాన్ నుండి వర్తకుల కారవాన్ లో లాహోర్ కు వచ్చింది. నదీరా బేగం అందచందాలకు నగరంలో యువత గగ్గోలు పెట్టేది. రాజవంశంలో చక్రవర్తికి ప్రత్యేకమైన ప్రతిదానిపైనా మొదటి హక్కు ఉంటుంది. అలాంటి సన్నివేశంలో నాదిరాను అక్బర్ చక్రవర్తి ఆస్థానానికి పిలిపించారు. నాదిరాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె స్టైల్ చక్రవర్తికి బాగా నచ్చింది. అప్పుడు అక్బర్ చక్రవర్తి నాదిరాకు అనార్కలి అనే పేరును.. అత్యంత ప్రత్యేకమైన కుమార్తె హోదాను ఇచ్చాడని చెబుతారు. కాదు ఆమె ఉంపుడుగత్తె అని కూడా కొందరు విశదపరిచారు. కానీ వీటిలో ఏ థియరీ నిజమో ఎవరికీ తెలీదు.
అనార్కలి ఎప్పుడు.. ఎలా చనిపోయింది?
అనార్కలి మరణం ఒక మిస్టరీ. పాకిస్థాన్ లోని అనార్కలి సమాధిపై రెండు తేదీలు రాసి ఉన్నాయి. ఒకటి 1599 .. మరొకటి 1615.. ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది ఎవరికీ తెలీదు. సయ్యద్ అబ్దుల్ లతీఫ్ తన పుస్తకం `తారిఖ్-ఎ-లాహోర్`లో అనార్కలి నిజానికి అక్బర్ భార్య అని రాశారు. అయితే ప్రిన్స్ సలీమ్ పై ప్రేమాయణం కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాధిపై 1599 రాసి అనార్కలి మరణించిన సంవత్సరం అని అబ్దుల్ లతీఫ్ పుస్తకంలో రాసారు. కాగా 1615 సమాధి నిర్మాణం పూర్తయిన సంవత్సరం. ప్రిన్స్ సలీం అలియాస్ జహంగీర్ అనార్కలిని పిచ్చిగా ప్రేమించాడు. ఆయనే ఈ సమాధిని నిర్మించి అనార్కలి పేరును రాసి పెట్టాడు. నేను నా ప్రియమైన వ్యక్తిని ఒక్కసారి దక్కించుకోగలిగినా నేను అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతాను.. ప్రళయం వచ్చే వరకు... అని ఎమోషనల్ కోట్ ని దానిపై రాసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.