భారత్ లో ఆమ్నెస్టి దుకాణం బంద్ రచ్చ అసలేంది?
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘోరం.. దారుణం జరిగినా వెంటనే మానవ హక్కుల ఉల్లంఘన మీద చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ప్రపంచ స్థాయిలో పని చేసే సంస్థగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ సింఫుల్ గా చెప్పాలంటే ఆమ్నెస్టి ఇంటర్నేషన్ ల్ గా సుపరిచితం. మరి.. ఈ సంస్థ తన కార్యకలాపాల్ని భారత్ లో నిలిపివేస్తున్నట్లుగా పేర్కొన్న వైనం సంచలనంగా మారింది.
తమను భారత్ ప్రభుత్వం వెంటాడి వేధిస్తున్నట్లుగా ఆరోపిస్తోంది. ఈ తీవ్రమైన ఆరోపణల్ని చేస్తున్న వేళలోనే.. వారి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించటం కొత్త కలకలానికి తెర తీసినట్లైంది. దీనిపై ఇరువురు ఒకరిపై ఒకరు ఘాటు ఆరోపణలు చేసుకోవటం గమనార్హం. భారత్ లోని మోడీ సర్కారు తమను టార్గెట్ చేసిందని ఆమ్నెస్టీ ఆరోపిస్తుంటే.. కేంద్రప్రభుత్వ వాదన మరోలా ఉంది.
ఈ సంస్థ బ్యాంకు ఖాతాలోకి చట్ట విరుద్ధంగా నిధులు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ సంస్థ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమ్నెస్టీ తీరుపై కేంద్రం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా స్పందించింది. తమను రెండేళ్లుగా కేంద్రం వేధింపులకు గురి చేస్తుందన్నారు.
ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఘర్షణలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో చోటు చేసుకున్న మానవ హక్కుల హననం పై ప్రశ్నలు సంధించామని.. దీనికి బదులుగా బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ సంస్థలోకి వస్తున్న అక్రమ నిధులపై ఈడీ కన్నేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సంస్థపై ఈడీ విచారణ చేయటం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే.. ఆమ్నెస్టీ ఆరోపణలు సరికావంటూ కేంద్ర హోంశాఖ తిప్పికొట్టింది. వారి ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని కేంద్రం పేర్కొంది. భారత చట్టాల్ని ఉల్లంఘించి నిధులుతెచ్చుకుంటున్న సదరు సంస్థ తాము చేస్తున్న పనుల నుంచి దృష్టి మరల్చటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ రచ్చ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేట్లుగా లేదని చెప్పక తప్పదు.