• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తల్లిదండ్రులు , కాలేజీ...

తల్లిదండ్రులు , కాలేజీ యాజమాన్యాల మధ్య చిచ్చు పెడుతున్న 'అమ్మఒడి' !

By - Tupaki Desk
Update: 2020-01-28 06:22 GMT
అమ్మఒడి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలులోకి తీసుకువచ్చిన ఒక పథకం. ఈ అమ్మఒడి ద్వారా ప్రతి పేద పిల్లవాడు కూడా కార్పొరేట్ స్థాయి విద్యని అభ్యసించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతి పేద విద్యార్థి స్కూల్ ఖర్చుల కోసం , నేరుగా తల్లుల అకౌంట్స్ లోనే రూ. 15 వేలని జమచేస్తున్నారు. ఈ పథకం ఈ నెలలోనే అట్టహాసంగా ప్రారంభించారు. చాలావరకు ఇప్పటికే ఆ అమ్మఒడి పథకానికి అర్హులైన వారికీ డబ్బు కూడా వారి ఖాతాలలో జమ అయ్యింది. అలాగే ఒకవేళ అర్హులైన ఎవరికైనా అమ్మఒడి పథకం డబ్బు రాకపోతే , మరోసారి అమ్మఒడి అప్లై చేసుకోవాలని సీఎం జగన్ చూసించారు.

ఇకపోతే , సీఎం జగన్ ప్రతి పేద పేదవాడు తన పిల్లలకి మంచి విద్యని అందించడానికి చాలా కష్టాలన్నీ ఎదుర్కొంటున్నాడు అని భావించి , వారికీ ఆసరాగా నిలవడానికి ఈ అమ్మఒడి పథకాన్ని తీసుకువస్తే ..ఇదే అదునుగా కొన్ని ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు , కాలేజీ యాజమాన్యాలు ఉన్నపళంగా పీజులని తమకి ఇష్టం వచ్చినట్టు పెంచేసి డబ్బులు కట్టాలని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య ప్రకాశం జిల్లా ..గిద్దలూరు నియోజకవర్గం లో ఎక్కువ గా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సాధారణంగా ప్రైవేటు కాలేజీలలో ఇంటర్ ఫీజు ఏడాదికి సగటున రూ.ఐదువేల చొప్పున వసూలు చేసేవారు. కానీ , ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అమ్మఒడి తీసుకు రావడం తో ఒక్కసారిగా ఫీజులని రెట్టింపు చేసినట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు ఒక ఫీజు చెప్పి ..ఇప్పుడు అకస్మాత్తు గా రెట్టింపు ఫీజు కట్టమంటే ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు.

అలాగే గిద్దలూరు నియోజక వర్గంలో చాలా వరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తుంది. సాధారణంగా ప్రైవేట్‌ పాఠశాలల్లోకానీ , ప్రైవేట్‌ కాలేజీలలో కానీ ఫీజుల వద్ద యాజమాన్యం కొంచెం కఠినంగానే ఉంటుంది. చెప్పిన సమయానికి ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్స్ లోకి కూడా అనుమతించరు. అమ్మఒడి డబ్బు సరిగ్గా సంక్రాంతి కి  ముందు అకౌంట్ లో జమ కావడంతో పండుగ ఖర్చులకి చాలామంది పేదవారు ఆ డబ్బుని వాడుకున్నారు. కొద్ది రోజులు సమయం ఇస్తే ఫీజు మొత్తం చెల్లిస్తాం అని చెప్తున్నా కూడా ఇన్నాళ్లూ ఫీజులు చెల్లించమంటే అమ్మఒడి వచ్చాక ఇస్తామన్నారని, ఇప్పుడు వెంటనే చెల్లించాలని యాజమాన్యాలు ఖరా ఖండి గా చెబుతున్నాయి. అలాగే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి వర్తిస్తుండటం తో అందరికి ఒకే సారి ఫీజు కట్టలేక మరి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యం లో ఫీజు విషయమై కొన్నిచోట్ల తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు మధ్య తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి.


Tags:    
  • AP Amma Vodi Scheme 2020 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu Political Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS