బాబుకు షాకిచ్చిన అమిత్ షా

Update: 2017-05-26 08:34 GMT
తెలుగు రాష్ర్టాల్లో అమిత్ షా పర్యటన రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలకు గట్టి షాక్ నే ఇచ్చింది.  కేంద్రం ఇచ్చిన లక్ష కోట్ల లెక్కలు చెప్పిన అమిత్ షాకు కేసీఆర్ గట్టి కౌంటర్ వేయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ వేడిలోనే ఆయన కేసీఆర్ ను దెబ్బతీసేందుకు ఇక్కడే వ్యూహం రచించారని తెలుస్తోంది.  కేసీఆర్ ను దెబ్బ తీసేందుకు పన్నుతున్న ఆ వ్యూహం ఇటు ఏపీలో మిత్రపక్షం టీడీపీని కూడా నష్టపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
    
కేసీఆర్, చంద్రబాబులిద్దరూ నియోజకవర్గాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాలు పెంచితే తమకు మళ్లీ అధికారం ఖాయమయ్యేలా వారు ప్లాన్లు గీసుకున్నారు. ఇద్దరూ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో తమ పార్టీలో చేర్చుకున్నారు. కేసీఆర్ అయితే... నియోజవర్గాల పెంపునకు సూటయ్యేలా జిల్లాలనూ పెంచేశారు. రెండు పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచి నియోజకవర్గాలు పెంచేందుకు కొంతవరకు మార్గం సుగమం చేసుకున్నారు. కానీ... తాజా పరిణామాల నేపథ్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అడ్డం తిరుగుతున్నారు. తనకు గట్టి కౌంటర్లేసిన కేసీఆర్ ను దెబ్బకొట్టాలంటే నియోజకవర్గాల పెంపు విషయం పూర్తిగా పక్కన పెట్టాలని ఆయన డిసైడైనట్లు తెలుస్తోంది. ఇదే విషయం మోడీకి కూడా చెప్పి ఆయన కూడా వీరి ఒత్తిళ్లకు లొంగకుండా చేయాలన్నది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది.
    
నియోజకవర్గాల పెంపుతో బీజేపీకి లాభమేంటి అన్న కొత్త ప్రశ్నను షా వేస్తున్నారు. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో క‌మ‌లానికి ఏమ‌న్నా ఉప‌యోగం ఉందా..! ఉంటే చూద్దాంలే అంటున్నారాట‌. విందు స‌మావేశంలో చంద్ర‌బాబు ఈ అంశంపైనే ప్ర‌త్యేకంగా రిక్వెస్ట్ చేయ‌గా… దీనివల్ల తమకు లాభమేమీ లేదని కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. అయితే... త్వ‌ర‌లో ఆలోచించి తేల్చేద్దం అని మాత్రం చెప్పినట్లు సమాచారం.  దీంతో కేసీఆర్ తో పాటు చంద్రబాబుకూ గట్టి దెబ్బే పడనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News