ట్రంప్ గెలిస్తే 28శాతం అమెరిక‌న్లు జంప్‌

Update: 2016-05-22 11:11 GMT
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు అమెరికాలో మారుమోగిపోతోంది. అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ట్రంప్ వ్యవహార శైలి చాలా దూకుడుగా ఉంటుంది. దేన్నైనా అంతు తేల్చాల్సిందే అన్న రీతిలో ఆయన ప్రసంగాలు ఉంటున్నాయి. ఈ విధంగానే ముస్లింలు - మెక్సికన్స్ - సెక్స్‌ పై ఆయన చేసిన కామెంట్లు సంచలనానికి ఆ త‌ర్వాత వివాదాని దారి తీశాయి. ఈ క్ర‌మంలోనే తెర‌మీద‌కు వ‌చ్చిన‌ కొత్త వార్త ఒక‌టి ట్రంప్ ఫోబియాకు అద్దం ప‌డుతోంది.

అమెరికా ప్రెసిడెంట్ పదవికి హిల్లరీ క్లింటన్‌తో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్న ట్రంప్ గనక ప్రెసిడెంట్ అయితే అమెరికన్లు దేశాన్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నారట. వీళ్లు ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారట. ఏకంగా ఇది 28% మంది ప్రజలు అభిప్రాయమని తేలింది. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన సర్వే అధ్యయనాల ప్రకారం ఈ విషయం బయటపడింది. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా గూగుల్ మరో ప్రకటన చేసింది. 7 రిపబ్లికన్ రాష్ట్ర ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన మార్చి 1 తేదీన తాము కెనడాకు ఎలా వెళ్లగలమని ఎక్కువ శాతం అమెరికన్లు సెర్చ్ చేసినట్లు  గూగుల్ ప్రకటించింది. దీంతో యూఎస్‌ లో ట్రంప్ పట్ల వ్యతిరేక స్వరం ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్ధమ‌వుతోంది.
Tags:    

Similar News