వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా?
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నిన్ననే వైసీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయిరెడ్డి తాను క్వారంటైన్ కు వెళుతున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. దీంతో నేతలంతా షాక్ కు గురయ్యారు.
ఇక తాజాగా వైసీపీ మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా కరోనా బారినపడినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా అంబటి రాంబాంబు మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.
వైసీపీ నేతలంతా ఇలా వరుసగా కరోనా బారినపడుతుండడం ఆ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో పర్యటనలు, ప్రజల్లోకి వెళ్లడానికి నేతలు విరమించుకుంటున్నారు.