సూపర్ సిక్స్ మరింత పక్కా.. చంద్రబాబు కీలక నిర్ణయం!
దీనిలో భాగంగా.. మహిళలు.. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి బుక్ చేసుకునే సిలిండర్ సొమ్మును ప్రభుత్వం ఇవ్వనుంది.
2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌ను మరింత పక్కాగా అమలు చేయాలని సీఎం చంద్రబా బు నిర్ణయించారు. వైసీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక పథకాన్ని అమలు చేయడంతో ప్రజల చేతుల్లోకి సంక్షేమం రూపంలో సొమ్ములు చేరాయని.. కానీ, ఇప్పుడు అవే పథకాలను తాము కూడా అమలు చేస్తు న్నా.. రెండు మూడు నెలల గ్యాప్ రావడతో ప్రజల్లో సంక్షేమంపై జోష్ రావడం లేదని.. మంత్రులు చెప్పి న సూచనలను సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతినెలా సంక్షేమం పై చర్చ జరిగే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. ఇదేసమయంలో కొన్నికొన్ని పథకాలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి.. మరికొన్నింటిని ప్రతి నెలా ఒకసారి అమలు చేసేందుకు అవకాశం ఉంటే.. దాని ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనిలో ప్రధానంగా మహిళలపై ప్రభావం చూపించే దీపం-2.0 పథకాన్ని ప్రతినాలుగు నెలలకు ఒకసారి అమలు చేయాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా.. మహిళలు.. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి బుక్ చేసుకునే సిలిండర్ సొమ్మును ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే.. ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకునేవారికే నిధులు ఇస్తుండగా.. ఇక నుంచి సిలిండర్ బుక్ చేసుకున్నా.. చేసుకోకపోయినా.. నాలుగు మాసాలకు ఒకసారి రాయితీ సొమ్మును మహిళల ఖాతాల్లో వేయనున్నారు. తద్వారా.. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయనున్నారు. అలానే.. తల్లికి వందనం పథకాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే అమలు చేస్తున్నారు.
అయితే.. రాబోయే రోజుల్లో దీనిని మూడు మాసాలకు లేదా నాలుగు మాసాలకు ఒకసారి అమలు చేయాల ని నిర్ణయించారు. తద్వారా నిరంతరం ప్రజల ఖాతాల్లోకి సంక్షేమం తాలూకు నిధులు చేరుతాయని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. తల్లికి వందనం కింద 13 వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. అయితే.. దీనిని విభజించి.. నాలుగు మాసాలకు ఒకసారి 4 వేల చొప్పున ఒక్కొక్క విద్యార్థికీ ఖాతాల్లో వేయనున్నారు. తద్వారా సంక్షేమ పథకాలపై నిరంతరం చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.