మూడు లక్షల మంది జనం...అతి పెద్ద ధింసా నృత్యం!

అదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ బహిరంగసభకు హాజరవుతారని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ప‌క‌డ్బందీగా చేయాల‌ని కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచించింది.

Update: 2026-07-24 23:30 GMT

కనీ వినీ ఎరగని విధంగా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని పేజీగా ఉండేలా ఒక అతి పెద్ద కార్యక్రమం జరగబోతోంది. దానికి ఉత్తరాంధ్ర భారీ వేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా ఎక్కడా ఈ తరహా సభ చూడలేదు అన్నట్లుగా ఏర్పాట్లు చేయాలని కూటమి ప్రభుతం కంకణం కట్టుకుంది. ఇంతకీ ఈ హడావుడి అంతా దేనికి అంటే ఉత్తరాంధ్రాలో ఆగస్టు 1న ప్రారంభం అవుతోంది భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. దాంతో ఈ సభ అదిరిపోయే లెవెల్ లో ఉండాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

నభూతో నభవిష్యత్ అనే రీతిలో :

ఇక చూస్తే కనుక ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని కూటమి భావిస్తోంది. ఇక ఆనాటి ప్రధాని సభకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ఏకంగా మూడు లక్షల మంది తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో లక్షలలో ఒక సభ జరగడం అంటే అది రికార్డు అనే అంటున్నారు. దాంతో ఈ సభ మీద ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది.

స్వాగతం సైతం :

అదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ బహిరంగసభకు హాజరవుతారని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ప‌క‌డ్బందీగా చేయాల‌ని కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచించింది. అంతే కాదు ఈ సభ పూర్తిగా విజయవంతం కావడం కోసం కూటమి పార్టీలకు చెందిన నాయకులు అంతా పూర్తిగా సమన్వయంతో పనిచేసి ప్ర‌ధాని స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కూడా కూటమి కోరుతోంది. మరో వైపు చూస్తే ఉత్తరాంధ్ర వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13 వేల మందితో దేశంలోనే అతి పెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయడం విశేషం.

అదిరిపోయే విధంగా సభ :

ఇక ఆగస్టు 1వ తేదీన ఉదయం పది గంటలకే ఈ సభ జరగనుంది. దాంతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇతర ప్రముఖులు అంతా ఈ సభ కోసం హాజరు కానున్నారు. మోడీ విషయం తీసుకుంటే ఆయన ప్రధాని హోదాలో ఎన్నో సార్లు ఉత్తరాంధ్రాకు వచ్చారు. కానీ ఆయనకు ఇది ఒక మరచిపోలేని అనుభవం గా ఉండాలని కూటమి ప్రభుత్వం గట్టి సంకల్పం తీసుకుంది. అందుకే మూడు లక్షల మందితో సభ అంటే మామూలు విషయం అయితే కాదని అంటున్నారు. మరి ఆ రోజున జరిగే సభను చూసేందుకు రెండు కళ్ళ చాలవేమో. ఇక ఆ సభను మొత్తం లైవ్ టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఎన్ని కోట్ల మంది అలా చూస్తారో కూడా ఒక పెద్ద చర్చగా ఉంది.

Tags:    

Similar News