• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతిలో రియల్ ఎస్టేట్...

అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపు కోసమే పవన్ ఇల్లు

By - Tupaki Desk
Update: 2018-03-14 17:14 GMT
అమరావతిలో జగన్ ఇల్లు కట్టుకోలేదు.. చంద్రబాబు కూడా అక్కడ సొంతిల్లు కట్టుకోలేదు. కానీ.. కొత్త పూజారి పవన్ కల్యాణ్ మాత్రం అక్కడ రెండెకరాల స్థలం కొని భారీ ఇల్లు కడుతున్నారు. దాంతో సహజంగానే అది చర్చనీయమవుతోంది. అంతేకాదు... ఈ ఇంటి విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి. అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఎకరాకు రూ.కోటికి తక్కువ లేదు. కానీ.. పవన్ కు మాత్రం ఎకరా రూ.20 లక్షల చొప్పున లింగమనేని ప్రయివేట్ లిమిటెడ్స్ వారు విక్రయించారు. పవన్ కు అమ్మిన రేటు... అమ్మిన సంస్థ పేరు బట్టి ఈ వ్యవహారంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    
చంద్రబాబు ప్రస్తుతం కృష్ణానది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లోనే ఉంటున్నారు. దీంతో చంద్రబాబు సహకారంతోనే పవన్ అక్కడ స్థలం తక్కువ ధరకు కొని ఇల్లు కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో కేవలం రూ.20 లక్షలకే ఎకరా దొరకడానికి కూడా కారణాలు చెప్తున్నారు. అమరావతి రాజధాని అయినప్పటికీ ఇంకా అక్కడ పెద్దగా జనాల్లేరు. కేవలం ఆఫీసులు మాత్రమే ఉంటున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్నంత ఊపు లేదు. దీంతో ఎవరైనా సెలబ్రిటీ అక్కడ ఇల్లు కట్టుకోవడం మార్కెట్ కు ఊపు తెస్తుందన్న ఉద్దేశంతో బడా రియల్టర్లు అయిన నేతలు కొందరు పవన్ కు అక్కడ తక్కువ ధరకు స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తున్నారన్న టాక్ కూడా ఉంది.
    
గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి సహకరించిన పవన్ ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా అదంతా నిజం కాదని రాజకీయాల్లో చాలా మంది నమ్ముతున్నారు. అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారం పవన్ చేస్తున్నారని.. టీడీపీ బలహీనంగా ఉన్నచోట జనసేన పోటీ చేసి చంద్రబాబుకు సహకరిస్తుందన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే తక్కువ ధరకు స్థలం.. అమరావతిలో ఇల్లు అన్న ఆరోపణలు  వస్తున్నాయి.
Tags:    
  • Pawan kalyan 
  • Amaravati 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS