నియంతల పేర్లన్నీ 'M' తోనే..మోదీ పేరు తీయకుండానే రాహుల్ ట్విట్ - తీవ్ర దుమారం!
రాహుల్ గాంధీ చేసిన ఓ ట్విట్ ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇంతకీ రాహుల్ గాంధీ చేసిన ఆ ట్విట్ లో ఏముంది అంటే ... మార్కోస్, ముస్సోలినీ, ముబారక్, ముషారఫ్.. ఇలా నియంతల పేర్లన్నీ 'ఎం' తోనే మొదలవుతాయి ఎందుకు? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. అయితే ప్రధాని మోడీ పేరు కూడా ఎం తోనే ప్రారంభం అవుతుంది. కానీ, మోడీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా రాహుల్ పరోక్షంగా విమర్శలు కురిపించారు. వ్యవసాయ చట్టాలు, రైతుల విషయంలో ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ రాహుల్ ఈ స్థాయిలో విమర్శలు చేశారు.
'నియంతల పేర్లు 'M' అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయి? మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో..' అంటూ రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. అయితే, దీనికి బీజేపీ నేతలు, కొంత మంది నెటిజన్లు రాహుల్ వ్యాఖ్యలకు దీటుగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ విమర్శలు కురిపించారు.
మరికొంత మంది మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ఈ వివాదం మధ్యలోకి తీసుకురావడం గమనార్హం. 'అసలు ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోదీ. అది 'ఎన్'తో కదా మొదలయ్యేది..' అంటూ మరికొందరు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులకు సంఘీభావంగా రాహుల్ మరో ట్వీట్ చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్న వారి ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేస్తున్నారంటూ రాహుల్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. పోలీసులు మేకులు, బారికేడ్లకు ఏర్పాటు చేయడంపైనా ఆయన మండిపడ్డారు.