చంద్రబాబుకు నో.. కేసీఆర్‌ కు ఎస్

Update: 2018-12-12 15:30 GMT
తెలంగాణలో అద్భుత విజయం సాధించిన కేసీఆర్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే దేశ రాజకీయాల్లోకి ఎంటరవుతానంటూ నిన్న భారీ ప్రకటన చేశారు. బీజేపీ - కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో కదులుతానని చెప్పారు. దీంతో దేశంలోని పార్టీల దృష్టి ఆయనపై పడింది.
   
ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం - తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీతో కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారు. నిన్న కేసీఆర్ విజయం తరువాత కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం వెంటనే స్పందించి అభినందనలు తెలిపారు. ఇంకా పలు ఇతర పార్టీల నేతల నుంచీ కేసీఆర్‌ కు అభినందనల వర్షం కురిసింది.
   
అదేసమయంలో కాంగ్రెస్ - చంద్రబాబులను తట్టుకుని భారీ విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పార్టీలు ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు 21 పార్టీలతో సమావేశమేర్పరిచినప్పటికీ అందులో అత్యధికం యూపీఏలో ఉన్నవే.
   
ఇప్పడు అందులోని అనేక పార్టీలు కేసీఆర్ వైపు చూస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం తరువాత దిల్లీలో మూడు రోజుల పాటు మకాం వేసి జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.


Tags:    

Similar News