• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ ప్రసంగంపై అంతటా...

మోడీ ప్రసంగంపై అంతటా ఉత్కంఠ

By - Tupaki Desk
Update: 2016-12-31 11:06 GMT
పెద్ద నోట్ల రద్దు తరువాత వాటిని జమ చేయడానికి విధించిన గడువు నిన్నటితో పూర్తయింది. వాట్ నెక్స్ట్ అనేది మొదలైంది. దీంతో ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ  జాతిని ఉద్దేశించి చేయబోయే ప్రసంగంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. 500 - 1000 నోట్ల రద్దు తరువాత నల్లధనం అదుపులోకి వచ్చిందన్న అంశం ప్రధాని ప్రసంగంలో ఉంటుందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
    
నవంబర్ 8 రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ పెద్ద నోట్ల రద్దు ప్రకటించటం తెలిసిందే. పాత నోట్ల రద్దు వల్ల నెలకొన్న నోట్ల లభ్యత సమస్యలు పరిష్కరించేందుకు 50 రోజుల సమయం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ తీసుకున్న గడువు శుక్రవారంతో ముగిసింది. పాత నోట్లను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు విధించిన గడువుకూడా ముగిసింది. ఆర్‌ బిఐలో మాత్రం మార్చి 31 వరకూ డిపాజిట్ చేసుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ  ఈ రోజు రాత్రి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
    
పెద్దనోట్ల రద్దు పరిణామాలు - ప్రయోజనాల గురించి ప్రధాని వివరించవచ్చునని బిజెపి నేతలు చెబుతున్నారు. ఏమేరకు నల్లధనం అదుపులోకి వచ్చింది? బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన పాత నోట్లలో ఏ మేరకు నల్ల ధనం ఉన్నదనేది కూడా మోదీ వివరించవచ్చని అంటున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత పెద్ద నోట్లలో కూడా నల్లధనం ఉన్నదని ఎన్‌ డిఏ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం లక్షా యాభై వేల కోట్ల నల్లధనం అదుపులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల అనధికారికంగా చెబుతున్నారు. మోదీ ప్రసంగంలో ఇలాంటి పలు అంశాలను ప్రజల ముందు పెట్టే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఏమేరకు డబ్బు బ్యాంకుల్లోకి వచ్చింది? అందులో నల్లధనమెంత? అనేది కూడా తేలిపోనుంది. ఈ సమాచారంతోపాటు అవినీతిని అదుపు చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ఇకమీదట తీసుకోనున్న కొత్త చర్యలను కూడా ప్రధాని ప్రజల ముందు పెట్టవచ్చని అంటున్నారు. బినామీ ఆస్తులను అదుపు చేసేందుకు తాను తీసుకుంటున్న తదుపరి చర్యలను కూడా ప్రజలకు వివరించవచ్చని అంటున్నారు.
    
జన్‌ ధన్ ఖాతాలోని డబ్బును ఖాతాదారులైన పేదలకు పంచే  అవకాశాలు ఉండొచ్చు. జన్‌ ధన్ ఖాతాల్లో దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. నవంబర్ 8 నుండి డిసెంబర్ 25 వరకు మొత్తం 14 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యింది. దేశంలో మొత్తం 15 లక్షల 44 వేల కోట్లనగదు చెలామణిలో ఉన్నది. డిసెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం ఎంత అనేది కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశాలున్నాయి.  లేదంటే మోడీ మళ్లీ ఇంకో కొత్త బాంబు పేలుస్తారేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Narendra Modi 
  • Demonetisation 
  • Telugu NEWs 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS