ఎయిర్ ఇండియా సర్వర్ డౌన్..విమానాలు ఆలస్యం

Update: 2018-06-23 12:42 GMT
విమాన ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తోంది. కొన్ని గంటల నుంచి ఎయిర్ ఇండియా సర్వర్ సడెన్‌ గా డౌన్ అయిపోయింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌ పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు కూడా విమానాశ్రయంలో దిగకుండా పైనే చక్కర్లు కొడుతున్నాయి. ఇక.. విమానాలు ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది.అయితే.. ఇప్పటి వరకు ఎన్ని విమానాలు ఆలస్యం అయ్యాయనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

కాగా, ఇలా విమాన‌శ్ర‌యంలో ప్రయాణికులు ఖాళీగా కూర్చోలేక తమ బాధనంతా సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు. ఇప్పుడే ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నాను. ఎయిర్ ఇండియా సర్వర్స్ డౌన్ అయ్యాయి. డొమెస్టిక్ - ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ప్రయాణికులంతా ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ లో చిక్కుకుపోయారు. కనీసం నడవడానికి కూడా ఎయిర్‌ పోర్ట్‌ లో ప్లేస్ లేకుండా అయిపోయింది. అంతా గందరగోళం.." అంటూ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అఖిలేశ్ మిశ్రా ట్వీట్ చేశాడు. "గంట నుంచి విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరూ దాని గురించి సమాచారం ఇవ్వలేదు. ఎయిర్ ఇండియా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నది.." అంటూ ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానం నుంచి ట్వీట్ చేశాడు.
Tags:    

Similar News