పాక్‌..చైనా..అర‌బ్‌ దేశాల‌కు ఇక అగ్నిప‌రీక్షే!

Update: 2015-11-09 09:09 GMT
భార‌త్ అమ్ముల పొద‌లో మ‌రో అస్త్రం సిద్ధం అవుతోంది. ఆత్మ‌ర‌క్ష‌ణ విష‌యంలో రాజీ ప‌డేది లేద‌న్న విష‌యాన్ని తాజాగా మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. అగ్ని-4 క్షిప‌ణిని తాజాగా ఒడిశాలోని బాలాసోర్ నుంచి సోమ‌వారం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే విజ‌య‌వంత‌మైన అగ్ని క్షిప‌ణి తాజా ప‌రీక్ష‌తో మ‌రింత శ‌క్తివంతంగా మార‌నుంది.

ఈ ప్ర‌యోగానికి ఒక ప్ర‌త్యేక ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ భూమి మీద నుంచి భూమి మీద ల‌క్ష్యాల్ని అగ్ని-4 మ‌రింత శక్తివంత‌మైంది. 4వేల కిలోమీట‌ర్ల దూరాన ఉన్న ల‌క్ష్యాన్ని తాజా ప్ర‌యోగంతో అగ్ని 4 ఛేదించ‌గ‌ల‌దు. దీంతో.. పాకిస్థాన్ లోని ఏ ల‌క్ష్యాన్ని అయినా అగ్ని-4తో గురి పెట్టే సామ‌ర్థ్యం భార‌త్ సొంత‌మైంది. అంతేకాదు.. చైనాలోని 40 శాతం భూభాగంపై గురి పెట్ట‌గ‌లిగిన స‌త్తా మ‌న సొంతమైంది. పూర్తి స్వ‌దేశీ పరిజ్ఞానంతో అణ్వాయుధాల‌ను ప్ర‌యోగించే ఐదో త‌రం క్షిప‌ణిగా దీన్నిఅభివృద్ధి చేశారు.

తాజాగా జ‌రిపిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌టంతో భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్టంగా మారింద‌ని చెప్పొచ్చు. తాజా ప‌రీక్ష‌తో పాక్‌.. చైనాతో పాటు..ప‌లు అర‌బ్‌దేశాల్లోని ల‌క్ష్యాల మీద కూడా గురి పెట్టే సామ‌ర్థ్యం మ‌న సొంత‌మైంద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News