రేప్ నాటకం ఆడిన యువతిపై చర్యలు.. సిద్ధమవుతున్న పోలీసులు
తనను కిడ్నాప్ చేశారని, గ్యాంగ్ రేప్ చేశారని నాటకమాడి.. అమాయకులైన ఆటోడ్రైవర్లను కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన యువతిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ ప్రాంతానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని.. తనను కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేశారంటూ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే.. అదంతా ఓ నాటకమని పోలీసులు తేల్చారు. తన ప్రియుడితో బయటకు వెళ్లిన అమ్మాయి.. తల్లిదండ్రులను ఏమార్చే క్రమంలో ఈ అభూత కల్పనకు తెరతీసిందని చెప్పారు. ఫలితంగా.. అమాయకులైన ఆటో డ్రైవర్లు ఈ కేసులో చిక్కుకున్నారు.
పోలీసుల అరెస్టు.. ఇంటరాగేషన్ తో మానసికంగా కుంగిపోయిన ఓ ఆటోడ్రైవర్.. ఆ నేరం తానే చేశానని కూడా ఒప్పుకున్నాడట! అయితే.. పోలీసుల సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ తో ఆ యువతి బండారం బట్టబయలైంది. ఆమెచెప్తున్న వివరాలకు.. సీసీ ఫుటేజీల్లోని విజువల్స్ కు పొంతన కుదరకపోవడంతో సదరు అమ్మాయిపైనే సందేహాలు మొదలయ్యాయి.
దీంతో.. పోలీసులు ఆ యువతిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడించిందట. తన ప్రియుడితో బయటకు వెళ్లిన యువతి.. అది బయట పడుతుందేమోనని ఈ డ్రామా ఆడినట్టు వెల్లడైంది. దీంతో.. సదరు అమ్మాయిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్ యూనియన్ కూడా తీవ్రంగా స్పందించింది. కరోనాతో ఉపాధి లేక అవస్థలు పడిన ఆటో డ్రైవర్లు.. ఇప్పుడిప్పుడే కుదుటపడే ప్రయత్నాలు చేస్తుండగా.. వారిని ఇలా ఇబ్బందులకు, వేధింపులకు గురిచేసిన అమ్మాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తన దుస్తులు తానే చించుకొని గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతి.. మొత్తం ఐదుగురు అమాయకులైన డ్రైవర్లను నిందితులుగా పేర్కొంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. న్యాయ పరంగా ఎలాంటి కేసులు నమోదు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.