• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అబ్దుల్ కాలం ఓ జిహాదీ .....

అబ్దుల్ కాలం ఓ జిహాదీ .. ఎవరన్నారంటే ?

By - Tupaki Desk
Update: 2021-03-24 06:32 GMT
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా .. ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి . డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం.లలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో క్షిపణులు ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లాయి.

జులై 1992 నుంచి డిసెంబర్ 1999 వరకు ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం.. ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు.  పదవీకాలం ముగిసిన అనంతరం విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు. దేశ, విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. 2015 జులై 27 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఐఐఎం విద్యార్థులకు పాఠం చెబుతూ కుప్పకూలిపోయారు.

 ఇదిలా ఉంటే .. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఓ పూజారి. దివంగ‌త మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. క‌లాం ఓ జిహాదీ అంటూ  వెల్లడించారు. దేశంలో అత్యున్న‌త స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవ‌రూ ఇండియాకు అనుకూలంగా ఉండ‌ర‌ని, క‌లాం ఓ జిహాదీ అని అన్నారు. అలీఘ‌డ్‌ లోని ద‌స్నాదేవి ఆల‌య పూజారి య‌తి న‌ర్సింగానంద స‌ర‌స్వ‌తి ఈ వ్యాఖ్య‌లు చేశారు. డీఆర్ ‌డీవో చీఫ్ ‌గా ఉన్న స‌మ‌యంలో క‌లాం.. పాకిస్థాన్ ‌కు అణు బాంబు ఫార్ములాను స‌ప్ల‌య్ చేసిన‌ట్లు ఆరోపణలు చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో ఉన్న స‌మ‌యంలో క‌లాం ప్ర‌త్యేక సెల్‌ ను ఏర్పాటు చేశార‌ని, అక్క‌డ ముస్లింలు మాత్ర‌మే ఫిర్యాదు చేయ‌వచ్చు అన్నారు. ఇటీవ‌ల ఘ‌జియాబాద్ ఆల‌య ప్రాంగ‌ణంలో ఓ ముస్లిం కుర్రాడు నీళ్లు తాగిన ఘ‌ట‌నపై స్పందిస్తూ ఆ పూజారి ఈ కామెంట్స్ చేశారు.  కలాం ఒక్కడే కాదు, ఇండియాలో అత్యున్నత పదవులు పొందిన ముస్లింలు అందరూ దేశ వ్యతిరేకులే అని  పూజారి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం రేపుతున్నాయి.
Tags:    
  • Missile Man of India 
  • Abdul Kalam 
  • Latest Political News 

Similar News

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS