• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ ఎమ్మెల్యే బావమరిది...

ఆ ఎమ్మెల్యే బావమరిది భార్యను వద్దలేదట

By - Tupaki Desk
Update: 2016-09-12 17:10 GMT
పేరుకు సామాన్యుల పార్టీ అనే కానీ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద వచ్చే నేరారోపణలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆదర్శాలు వల్లె వేస్తూ.. ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి.. ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వస్తున్న లైంగిక ఆరోపణలు షాకింగ్ గా మారాయి. ఈ మధ్యనే ఆమ్ ఆద్మీకి చెందిన మంత్రి ఇద్దరు మహిళలతో కలిసి రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటనకు చెందిన వీడియో బయటకు వచ్చి మంత్రి పదవి పోగొట్టుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ పై ఆయన బావమరిది భార్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో తనపై అమానతుల్లా ఐదుసార్లు లైంగిక దాడి చేసినట్లుగా కోర్టుకు వెల్లడించారు. ఒకసారి అయితే లిఫ్ట్ లోనే తనపై లైంగిక దాడి చేసినట్లుగా వెల్లడించారు.

ఈ ఉదంతంపై తన భర్తకు ఫిర్యాదు చేస్తే.. ఎమ్మెల్యే తనకు వ్యాపారంలో సాయం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలంటూ తన భర్త చెప్పినట్లుగా ఆమె కోర్టుకు వెల్లడించారు. తనకు.. ఎమ్మెల్యేకు మధ్య జరిగిన సంభాషణకు చెందిన ఒక సీడీనీ.. పెన్ డ్రైవ్ ను ఆమె పోలీసులకు ఇచ్చారు. తాను భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నానని.. అద్దె ఇంట్లో ఉంటూ కూతుర్ని చదివించుకున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన మనుషులు తనను బెదిరిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Tags:    
  • AAP MLA 
  • Amanatullah Khan 
  • Sexual harassment 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS