మహిళ కోసం హిజ్రాగా మారిన యువతి .. కానీ, ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
ప్రేమ ... ఈ పదానికి రోజు రోజుకీ అర్థం మారిపోతుంది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడే వారు కొందరైతే, ప్రేమించడం లేదనే కసితే ఉన్మాదులుగా మారి హత్య చేసిన వారు మరికొందరు. ప్రేమించానని మాయమాట చెప్పి, తరువాత తప్పతించుకు తిరిగేవారు ఎందరో ఇలాంటి మోసాల గురించి తరుచూ వింటూనే ఉంటాం. వీటికి తోడు ఇటీవల అమ్మాయిని అమ్మాయి ప్రేమించడం , అబ్బాయిని అబ్బాయి ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా తరచూ వింటూనే విన్నాం. తాజాగా ఓ యువతి మరో మహిళను ప్రేమించింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమనుకున్నారు. కొంతం కాలం కలిసి జీవించి, వివాహం చేసుకోవాలి అనుకున్నారు.
అయితే ఆ మహిళ యువతికి ఓ కండిషన్ పెట్టింది. హిజ్రాగా మారితేనే వివాహం చేసుకుంటానని చెప్పింది. దీంతో ప్రేమించిన మహిళను వదులుకోలేక.. అతికష్టం మీద హిజ్రాగా మారింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఇరువురికి వివాహం కాలేదు. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. మంచి స్నేహితులుగా మారారు. సదరు యువతికి అబ్బాయి లక్షణాలు కొంచెం ఉండడంతో పూర్తి హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని, పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది. ఆమె మాటలు నిజమేనని నమ్మిన యువతి లింగమార్పిడి చేయించుకుని హిజ్రాగా మారింది.
దీంతో మొదటి ఇద్దరికీ వారి రిలేషన్ షిప్ లో ఆనందమే అనిపించింది. దీంతో ఇద్దరు కలిసి కొంతకాలం జీవించారు. ఈ క్రమంలో హిజ్రాను పెళ్లాడతానంటూ మహిళ చెప్పింది. కుటుంబసభ్యులను ఒప్పించి చేసుకుంటానని నమ్మించింది. అయితే, ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సదరు మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పిడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, న్యాయం చేయాలని యువతి కడప జిల్లా పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అర్ధంగాక తర్జనభర్జన పడుతున్నారు.