ఓ వైపు కామాంధులకు వేసే శిక్షలు చూస్తున్నారు , మరోవైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. అసలు మహిళలు , బాలికలు అన్న తేడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు , ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా నిత్యం దేశంలో మహిళలు అత్యాచారాలకు గురౌతుండటం బాధాకరం. తాజాగా అభం శుభం తెలియని ఓ 11 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఆ బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో కరివేపాకు కోసిస్తా అంటూ బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ సంఘటన కొంచెం ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంకి చెందిన ఓ వ్యక్తి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటివద్ద తల్లి లేదని గుర్తించిన నిందితుడు.. మీ అమ్మ కరివేపాకు అడిగింది.. పొలానికి వస్తే కోసిస్తానంటూ వెంట తీసుకెళ్లాడు. అతని మాటలు నమ్మి ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్లింది. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత మళ్లీ ఇంటి వద్ద దింపేసాడు. అయితే, తల్లి ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఏడుస్తుండడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
అయితే , ఆ బాలికది, నిందితుడిది ఒకే సామాజికవర్గం కావడంతో రాజీకి ప్రయత్నించినట్టు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న కనిగిరి సీఐ కె.వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్‌కుమార్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజీ ప్రయత్నాలు చేసిన పెద్ద మనుషులతో నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.