వెంకయ్యనాయుడి ఇంట్లో వేడుక... జగన్ రాక

Update: 2021-12-16 11:36 GMT
భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఇంట్లో వేడుక ఒకటి జరుగుతోంది. ఆయన మనమరాలు నీహారిక వివాహ రిసెప్షన్ విశాఖలో నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని భోగట్టా..

విశాఖలో ఒక రోజు టూర్ కి ఈ నెల17న వస్తున్న జగన్ వెంకయ్యనాయుడు మనవరాలు వివాహ రిసెప్షన్ లో కూడా పాలుపంచుకుంటారని అధికార వర్గాల సమాచారం. జగన్ విశాఖ వస్తే కచ్చితంగా పెళ్ళి కార్యక్రమాలు ఉండాల్సిందే అని ప్రత్యర్ధులు ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంటారు.

దానికి తగినట్లుగానే ఆయన టూర్లు కూడా డిజైన్ చేసుకుంటున్నారు అనుకోవాలి. విశాఖలో జగన్ ఈసారి పర్యటనలో కూడా రెండు పెళ్ళి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి సొంత పార్టీకి చెందిన డీసీసీబీ చైర్మన్ కుమార్తె వివాహ వేడుక అయితే రెండవది ఉప రాష్ట్రపతి ఇంట్లోది.

ఇదిలా ఉంటే తమిళనాడు గవర్నర్ తమిళ్ సై కూడా విశాఖలో రెండు రోజుల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి ఇంట్లో వివాహ వేడుకకు హాజరవుతారని చెబుతున్నారు.

ఇదే విధంగా అనేక మంది ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు అంతా ఉప రాష్ట్రపతి ఇంట జరిగే కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. మొత్తానికి చాలా కాలానికి విశాఖ రాజకీయ సందడిగా హడావుడిగా మారుతోంది. ఇక జగన్ సైతం విశాఖ రావడం తో సొంత పార్టీ వారితో పాటు రాజకీయ వర్గాలలో కూడా ఆసక్తికరమైన పరిణామంగా మారుతోంది.



Tags:    

Similar News