వాట్సప్ లో మీరీ మెసేజ్ ను అందుకున్నారా?
ఇవాల్టి రోజున ఎంతటి కొత్త విషయమైనా సరే మహా అయితే ఒక రోజు.. లేదంటే రెండు రోజుల్లో అందరికి తెలిసిపోయే పరిస్థితి. గతంలో ఉన్న మీడియాకు భిన్నంగా సోషల్ మీడియా భారీగా పెరిగిపోవటం.. వాట్సప్ పుణ్యమా అని జనజీవితంలో మార్పు వేగంగా వచ్చేసింది. గతంలో తమకు తెలిసిన విషయాన్ని టైం ఉన్నప్పుడు.. తమకు తెలిసిన వారు కలిసినప్పుడు చెప్పుకునే వారు. అందుకు భిన్నంగా.. వాట్సప్ వచ్చేశాక.. చేస్తున్నపనిని పక్కన పెట్టి మరీ.. తమ దగ్గరకు వచ్చిన సమాచారాన్ని తెలిసిన వారందరికి తెలియజేసే ఒక కొత్త పనిని సగటు జీవి అలవాటు చేసుకున్నాడు.
ఇప్పుడీ అలవాటు ఎంతగా మారిందంటే.. ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోవటమైనా కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ.. వాట్సప్ అప్ డేట్స్ చూసుకోవటం మాత్రం ఆలస్యం కాని పరిస్థితి. ఇక.. వాట్సప్ ను చూస్తే.. కొన్ని చిరాకులున్నా.. కొన్ని విషయాలు మాత్రం అద్భుతంగా అనిపించకమానవు. ఏదైనా జరిగినప్పుడు జనం స్పందించే తీరు.. వారిలో తన్నుకొచ్చే క్రియేటివిటీ చూస్తే ఉక్కిరిబిక్కిరి కావాల్సింది.
దేశ ప్రధాని మోడీ.. పెద్ద నోట్ల రద్దుపై సంచలన ప్రకటన చేసిన అరగంటకే.. రూ.వెయ్యి.. రూ.500 నోట్లను ఎటకారం చేసుకుంటూ.. వచ్చి పడిన పోస్టింగ్ లు చూస్తే.. సామాన్యుడు ఎంత చురుగ్గా వ్యవహరిస్తున్నారన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇదొక్కటే కాదు.. తనకు అనిపించిన విషయాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ.. లాజిక్ కు ఏ మాత్రం తగ్గకుండా.. అందరూ కన్విన్స్ అయ్యేలా కొన్ని పోస్టింగ్ లు వచ్చేస్తుంటాయి. తాజాగా అలాంటి పోస్టింగ్ ఒకటి హడావుడి చేస్తోంది. అదేమిటంటే.. ప్రస్తుత లోక్ సభలో పార్టీల బలాల్ని చూసినప్పుడు.. ఆ అంకెల్ని కలిపినప్పుడు చిత్రంగా చివరన ‘‘13’’ రావటం ఆసక్తికరమని చెప్పాలి. అదెలానంటే.. ప్రస్తుత లోక్ సభలో బీజేపీకి ఉన్న సీట్లు 283.. వీటిని కలిపితే వచ్చే అంకె ‘13’. ఇక.. ఎన్డీయే కూటమికి వచ్చిన సీట్లు ‘‘337’’. ఈ అంకెల్ని కూడితే వచ్చేది.. ‘‘13’’. ఇక.. యూపీఏకు వచ్చిన సీట్లు ‘‘58’’. ఈ రెండు అంకెల్ని కలిపితే వచ్చేది‘‘13’’. అంతేనా.. మిగిలిన వారందరికి కలిపితే వచ్చిన సీట్లు.. ‘‘148’’..ఈ అంకెల్ని కూడితే వచ్చిది ‘‘13’’ కావటం ఒక విశేషం.
ఇదొక్కటే కాదు.. ఏ మాత్రం సంబంధం లేని ముగ్గురికి సంబంధించి.. ఒక్క విషయం మాత్రం కామన్ గా ఉండటం కనిపిస్తుంది. అదిరిపోయే లాజిక్ గా కనిపిస్తూ.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. అదేమంటే.. బుద్ధుడు.. మహావీర.. మోడీకి సంబంధించిన చిత్రమైన పోలిక ఒకటి చూస్తే.. మోడీ భజన ఎక్కువైనట్లు కనిపించినా.. లాజిక్ గా చూస్తే మాత్రం.. నిజమేగా అనిపించక మానదు.
అదేమంటే.. బుద్ధడు పెళ్లి చేసుకొని.. భార్యను వదిలేసి తాను నమ్మిన సిద్దాంతాల కోసం తన జీవితాన్ని వెచ్చించాడు.. అదే సమయంలో ఆయన భార్య కూడా ఒంటరిగానే ఉండిపోయారు. బుద్ధుడి భార్యపేరు ‘యశోదర’. ఇక.. మహావీర కూడా పెళ్లి చేసుకున్నారు. ఆయన కూడా భార్యను వదిలేసి సన్యాసిగా మారాడు. తర్వాత ఆయన భార్య కూడా ఒంటరిగా ఉండిపోయారు. ఆమె పేరుకూడా.. ‘‘యశోద’’. కొన్ని వందల ఏళ్ల తర్వాత దేశ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాని మోడీ ముచ్చట చూద్దాం. ఆయన కూడా చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయన కూడా భార్యను వదిలేశాడు. సన్యాసిగా వ్యవహరించారు. ఆయన సతీమణి కూడా సింగిల్ గానే ఉండిపోయారు. ఆమె పేరు కూడా ‘‘యశోద’’ కావటం.. యాదృచ్చికమా? లేక.. చరిత్ర రిపీట్ అయినట్లా? అంటూ వచ్చిన పోస్టింగ్ ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. విపరీతంగా ఆకర్షిస్తోంది. నిజామా.. అబద్ధామా అన్న చర్చలోకి వెళ్లకుండా.. చెప్పిన విషయాన్ని.. చెప్పినట్లుగా చూసినప్పుడు వారు చెప్పే లాజిక్ కన్విన్స్ గా ఉంది కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/