పేప‌ర్ లీక్‌: అప్పుడు కాద‌ని.. ఇప్పుడు విద్యార్థుల‌కు బీజేపీ మ‌ద్ద‌తు!

ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీకి సంబంధించి విద్యార్థులు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించింది.

Update: 2026-08-10 14:06 GMT

ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీకి సంబంధించి విద్యార్థులు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించింది. ఇప్పుడు ఇదే డిమాండ్‌ను బీజేపీ కూడా వ్య‌క్తం చేస్తోంది. జార్ఖండ్ రాష్ట్ర స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నిర్వ‌హించిన ఉద్యోగాల ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ వ్య‌వ‌హారం ఆ రాష్ట్రంలో మంట‌లు రేపుతోంది. దీంతో విద్యార్థుల ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది.

ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇచ్చింది. వారిపై పోలీసుల దాడిని ఖండించింది. పార్ల‌మెంటు స‌మావేశాల్లోనూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ఆ స‌మ‌యంలో బీజేపీ మౌనంగా ఉంది. క‌ట్ చేస్తే.. జార్ఖండ్ విద్యార్థుల‌కు ఇప్పుడు కాంగ్రెస్ దూరం కాగా.. బీజేపీ వారిని అక్కున చేర్చుకుంది. విద్యార్థుల ప‌క్షాన అండ‌గా ఉంటామంటూ.. జార్ఖండ్ బీజేపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. దీనికి కార‌ణం.. బీజేపీ ఇక్క‌డ విప‌క్షంలో ఉండ‌గా.. కాంగ్రెస్ అధికార జేఎంఎం పార్టీలో భాగ‌స్వామిగా ఉంది. మొత్తంగా ఢిల్లీ విద్యార్థుల నిర‌స‌న‌కు బీజేపీ దూరంగా ఉండ‌గా.. జార్ఖండ్‌లో మాత్రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

సీఎం రాజీనామా చేయాలి..

విద్యార్థుల ఆందోళ‌న‌ల‌తో అప్ర‌మ‌త్త‌మైన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లోని ముగ్గురు స‌భ్యుల‌తో రాత్రికి రాత్రి రాజీనామా చేయించారు. దీంతో త‌ప్పు జ‌రిగింద‌ని.. సొరేన్ అంగీక‌రించిన‌ట్టేన‌ని చెబు తున్న బీజేపీ ఆయ‌నే ఇప్పుడు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. సీఎం క్ష‌మాప‌ణ లు చెప్పాల‌ని.. గిరిజ‌న యువ‌త‌ను మోసం చేశార‌ని ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై సీఎం మౌనంగా ఉన్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ కూడా.. ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

అసెంబ్లీ ముట్ట‌డి..

విద్యార్థులు ముందుగా పిలుపునిచ్చిన మేర‌కు.. సోమ‌వారం జార్ఖండ్ అసెంబ్లీని ముట్ట‌డించారు. తొలుత చ‌ర్చ‌ల‌కు రెడీ అంటూ.. ప్ర‌భుత్వం సంకేతాలు ఇచ్చింది. అయితే.. ఈ చ‌ర్చ‌ల‌కు వెళ్లిన విద్యార్థులు.. త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. కానీ, దీనికి ప్ర‌ష‌భుత్వం అంగీక‌రించ‌లేదు. దీంతో చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. అనంత‌రం.. అసెంబ్లీని ముట్ట‌డించేందుకు విద్యార్థులు పోటెత్తారు. పోలీసులు పెట్టిన ఆంక్ష‌ల‌ను సైతం కాదంటూ.. అసెంబ్లీవైపు దూసుకు వెల్లారు. మ‌రోవైపు జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇత‌ర ప్రాంతాల నుంచి రాంచీకి వ‌చ్చే విద్యార్థుల‌ను ఎక్క‌డిక‌క్క‌డే అరెస్టు చేసి.. స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర బ‌ల‌గాల‌ను పంపాల‌ని సీఎం హేమంత్ కోరారు.

Tags:    

Similar News