స‌హ‌జీవ‌నం చేస్తున్న ప్రియుడి దారుణం వింటే షాకే!

Update: 2018-08-26 05:31 GMT
పెళ్లి త‌ర్వాత ప్రేమ‌లు గ‌డిచిన కొన్నేళ్లుగా వింటున్న‌దే. వైవాహిక జీవితంలో ఎదుర‌య్యే ఇబ్బందులు.. స‌మ‌స్య‌ల కార‌ణంగా భ‌ర్త‌ల నుంచి విడిపోయి వేరే వారితో క‌లిసి స‌హ‌జీవ‌నం చేసే వారు ఈ మ‌ధ్య‌న ఎక్కువే చూస్తున్నాం. కానీ.. ఇలాంటి వాటి కార‌ణంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉంటుందో తాజా ఉదంతం స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి.

అంతేనా.. ప్రేమ పేరుతో ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఎంతో గాఢంగా ఉండాల్సింది పోయి.. ఆ బంధం ఏ మాత్రం చెడినా క‌ర్క‌సంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం చూసిన‌ప్పుడు.. ఇదేం ప్రేమ‌లురా బాబు? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కృష్ణా జిల్లా హ‌నుమాన్ జంక్ష‌న్ లో ఒక వివాహిత‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం గురించి వింటే నోట మాట రాదంతే. షాక్ తో ఒళ్లు జ‌ల‌ద‌రించ‌ట‌మే కాదు.. ఇంత‌టి పైశాచిక ప్రేమ ఏంట్రా బాబు అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

అస‌లేం జ‌రిగిందంటే.. రాజ‌మహేంద్ర‌వ‌రానికి చెందిన ప‌ల్లె ప‌ద్మ‌కు హ‌నుమాన్ జంక్ష‌న్ ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో ఒక బ్యూటీ పార్ల‌ర్ లో ప‌ని చేస్తోంది. గొడ‌వ‌ల కార‌ణంగా భ‌ర్త సూర్య‌నారాయ‌ణ‌తో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఏలూరుకు చెందిన బ‌త్తుల నూత‌న్ కుమార్ విక్ట‌ర్ తో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ స్థానికంగా ఒక ఇంట్లో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

ఏమైందో కానీ రెండు రోజుల క్రితం ప‌ద్మ‌.. నూత‌న్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆ త‌ర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ లో ఉంది. దీంతో.. ఆమె కుమార్తె తండ్రి సూర్య‌నారాయ‌ణ‌కు ఈ విష‌యాన్ని చెప్పింది. దీంతో.. సూర్య‌నారాయ‌ణ ప‌ద్మ ఇంటికి వెళ్లాడు. త‌లుపు త‌డితే స‌మాధానం లేదు. తలుపు తీయ‌టంతో సందేహంలో లోప‌ల‌కు వెళ్లిన ఆయ‌న అక్క‌డి దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు.

కాళ్లు క‌ట్టేసి.. రెండు చేతులు తెగిపోయి.. ఒంటి మీద బ‌ట్ట‌లు లేకుండా ప‌డి ఉన్న ప‌ద్మ‌ను చూసి.. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.  మ‌న‌స్ప‌ర్థ‌ల‌తోనే ప‌ద్మ ప్రియుడు నూత‌న్ ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ప‌ద్మ‌పై జ‌రిగిన దాడిపై వైద్యులు చెబుతున్న మాట‌లు వింటే నోట మాట రాదంతే.  

క‌త్తితో చేతులు.. మెడ కోసేయ‌టం.. ఒంటి మీద బ‌ట్ట‌లు లేకుండా చేయ‌ట‌మే కాదు.. కాళ్ల‌ను వైర్ తో క‌ట్టేసి.. ఊడిపోకుండా ట్యాగ్ లు వేయ‌ట‌మే కాదు.. ముఖానికి క‌వ‌ర్ తో ముసుగు వేశాడు. ఇంత చేసిన‌ప్పుడు బాధితురాలు అర‌వాలి క‌దా?  కేక‌లు వేయాలి క‌దా? అన్న సందేహం రావొచ్చు. ఇలాంటి ప్ర‌మాదాన్ని ఊహించి.. మ‌త్తు ఇంజ‌క్ష‌న్ ఇచ్చి విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తిపోట్లు పొడిచిన‌ట్లుగా గుర్తించారు.

 మృత్యువుతో పోరాడుతున్న ఆమె ప‌రిస్థితి గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. దాడి చేసిన తీరును చూసి పోలీసులు సైతం విస్మ‌యానికి గుర‌వుతున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. నూత‌న్ ఆచూకీ కోసం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజంగా ఒక మ‌నిషిని ప్రేమించిన మ‌నిషిపై అంత క‌ర్క‌శంగా దాడి చేసిన వైనం షాక్ కు గుర‌య్యేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News