65 ఏళ్ల మహిళకు 14 నెలల్లో 8 మంది పిల్లలు..
ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. క్లీన్ చిట్ గా కనిపించే నితీశ్ సర్కారుకు దిమ్మ తిరిగే షాక్ ఒకటి తగిలింది. బిహార్ రాష్ట్ర స్వరూపాన్ని మార్చేసిన ఇమేజ్ ను సొంతం చేసుకున్న నితీశ్ కు ఇప్పుడో పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి నెలకొంది. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బ తీయటమే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన దాణా కుంభకోణం గుర్తుకు వచ్చేలా ఒక భారీ స్కాం బయటకు వచ్చింది.
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గణాంకాల్లో చోటు చేసుకున్న వివరాలు ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఆడపిల్లల జననాల్ని పెంచేందుకు బిహార్ రాష్ట్ర సర్కారు ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని నిధుల్ని పక్కదారి పట్టేసేందుకు వీలుగా.. రికార్డుల్ని దారుణంగా మార్చేసిన తీరు చూస్తే.. నోటి వెంట మాట రాదంతే.
ఒక 65 ఏళ్ల మహిళ కేవలం 14 నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మంది పిల్లల్ని కనేసేలా రికార్డుల్ని మార్చేశారంటే.. వారి బరితెగింపు మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు. పుట్టినంతనే ఆడపిల్లల్ని చంపేసే దారుణ పరిస్థితులు బిహార్ లో ఎక్కువ. ఆ విధానానికి చెక్ పెట్టెందుకు వీలుగా భారీగా నిధుల్ని కేటాయించారు. ఈ నిధుల్ని కాజేసేందుకు వయసు మీరిన మహిళల పేర్లతో చేసిన దుర్మార్గం బయటకు వచ్చేసింది.వారి పేర్లను వాడేసుకొని.. భారీగా నిధుల్ని పక్కదారి పట్టించేశారు.
రాష్ట్రంలోని ముజఫర్ పుర్ జిల్లా ముసాహరి బ్లాక్ లో ఈ భాగోతం బయటకు వచ్చింది. ఒక అధికారికి వచ్చిన అనుమానం తాజా స్కాం బయట పడేలా చేసింది. తనకొచ్చిన అనుమానాన్ని పోలీసులకు చెప్పటం.. వారు కన్నేయటం ద్వారా.. డొంకంతా కదిలింది. 65 ఏళ్ల లీలాదేవీ అనే మహిళకు పద్నాలుగు నెలల్లో ఎనిమిది మంది పిల్లల్ని కన్నట్లుగా రికార్డుల్లో ఉందని.. ఇలా పరతి శిశువుకు రూ.1400 మొత్తాన్ని వారి ఖాతాలో వేసేలా చేశారు. ఆ మొత్తాన్ని లబ్థిదారులకు కాకుండా.. అధికారులు నొక్కేశారు. అంతేకాదు.. మరో మహిళ విషయానికి వస్తే.. కేవలం తొమ్మిది నెలల్లో ఐదుగురు మహిళలకు జన్మనిచ్చినట్ులగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారం బయటకు రాగానే.. జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. తాము చేసిన విచారణలో ఆరోపణలు నిజమని తేలాయని.. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు. తాజా ఉదంతాన్ని చూస్తే..1990లో వెలుగు చూసిన దాణా స్కాం గుర్తుకు తెచ్చేలా ఉండటం గమనార్హం. ఈ కుంభకోణంలో నకిలీ మందులు.. పశువుల దాణాలో కోట్లాది రూపాయిల్ని మింగేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న లాలూ.. చివరకు జైలు జీవితాన్ని అనుభవించేలా చేసిందన్నది మర్చిపోకూడదు. ఎన్నికలకు కాస్త ముందుగా బయటకు వచ్చిన ఈ ఉదంతం నితీశ్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పక తప్పదు.