'దేశం' లో 60 సిటింగులు గల్లంతు
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం కానుందా. ఈ సారి ఎన్నికలలో సైకిలు టైరుకు పంచరు పడనుందా! అవుననే అంటున్నాయి ఇంటేలిజేన్సీ వర్గాలు. ఆ ఎన్నికలలో దాదపు 60 తెలుగుదేశం ఎమ్మల్యేలు ఓటమి పాలు అవుతారని ఇంటేలీజేన్సీ వర్గాలు చెబుతున్నాయి. రహస్యంగా చేసిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటేలీజేన్సీ విభాగం తన పనిలో భాగం కాకుండా ఈ సర్వేను చేపట్టినట్లు తెలిసింది. 175 నియోజక వర్గాలలో - ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మందిని వివిధ ప్రశ్నలతో సర్వేను నిర్వహించినట్టు సమాచారం. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగిపోయే వాస్తావాలు వెలుగు చూసాయి. అవినీతి ఆరోపణలు - అశ్రిత పక్షపాతం - నైతిక బాధ్యత లేకపోవడం. గూండా గిరి పెరిగిపోవడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు దేశం పార్టీని వద్దనుకుంటున్నట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఇంటేలిజేన్సీ విభాగంలోని కొందరూ ఓటరుకు ట్యాబ్ లను ఇచ్చి వాటిలోని ప్రశ్నలకు ఉన్న ఖాళీలను పూర్తి చేయమని అడుగగా - వారిలో 85 శాతం మంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం - మా సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు మాత్రమే ఓటు వేస్తామని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా అవినీతి - గూండా గిరితో మాకు సంబంధం లేదని - మా సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు మాత్రమే ఓటు వేస్తామని విజయవాడ సిటీలోని కొందరు అన్నట్లు సమాచారం. అయితే ఈ సర్వే మొత్తం పారదర్శకంగానే జరిగిందని ఇంటేలిజేన్స్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పినట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని, ఒక్కటంటే ఒక్క పరిశ్రమగాని - ప్రాజేక్టును గాని ఆయన రాష్ట్రానికి తీసుకు రాలేకపోయారని సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. మొదట్లో ప్రత్యేక ప్యాకేజీకే ఓటు వేసి తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రత్యేక హోదా అంటూ మాట మార్చారని - రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు ఓటు వేసి మళ్లీ మళ్లీ మోసపోవడం మాకు ఇష్టం లేదని ప్రజల అభిప్రాయంగా సర్వే ద్వారా బయటపడింది. ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి హవా తగ్గింనట్లు కనిపిస్తోంది - ప్రస్తుత పరిస్థితే కనుక కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తప్పదని పరీశీలకులు అంటున్నారు.