ఇంటర్నెట్‌ను బ్రేక్ చేద్దాం.. లలిత్ మోడీ బలుపు మాటలు

తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ.. ఏళ్లకు ఏళ్లుగా విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు ప్రముఖులకు సంబంధించిన తాజా వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.;

Update: 2025-12-24 06:49 GMT

తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ.. ఏళ్లకు ఏళ్లుగా విదేశాల్లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు ప్రముఖులకు సంబంధించిన తాజా వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంటర్నెట్ ను మళ్లీ బ్రేక్ చేద్దామంటూ అందులోని ఒకరు అనుకున్నట్లే.. ఇప్పుడు వీరికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇంతకూ ఈ ఇద్దరు మరెవరోకాదు ఒకరు విజయ్ మాల్యా అయితే మరొకరు లలిత్ మోడీ. అవును.. ఈ ఇద్దరిలో కామన్ పాయింట్.. బ్యాంకులను మోసం చేసి వేలాది కోట్లతో విదేశాలకు ఉడాయించినోళ్లు.

కొద్ది రోజుల క్రితం విజయ్ మాల్యా 70వ పుట్టినరోజును పురస్కరించుకొని యూకేలోని తన నివాసంలో భారీ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే పార్టీకి దేవీయ బ్యాంకులకు వేలాది కోట్లు టోపీ పెట్టి జంప్ అయిన లలిత్ మోడీ కూడా ఉన్నారు. వీరిద్దరు కలిసిన వీడియోలో లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

భారత్ నుంచి పరారీలో ఉన్న అతి పెద్ద నేరగాళ్లం మేమిద్దరమే అంటూ వ్యంగ్యంగా పరిచయం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోను లలిత్ మోడీ తన ఇన్ స్టాలో షేర్ చేయటం చూస్తే.. అతగాడి బలుపు ఎంత పీక్స్ కు చేరిందన్నది ఇట్టే అర్థమవుతుంది. తాను పోస్టు చేసిన వీడియోకు క్యాప్షన్ కింద.. ‘‘ఇంటర్నెట్ ను మరోసారి భారత్ లో బ్రేక్ చేద్దాం. హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్ విజయ్ మాల్యా లవ్యూ’ అంటూ పోస్టు చేశారు.

తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడి.. విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్నిగడుపుతున్న విజయ్ మాల్యా.. లలిత్ మోడీ తీరుపై దేశ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహంతో పాటు.. చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఇంకెన్నేళ్లు పడుతుందన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. వీరి బలుపు దిగేలా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News