ఇంత పాశవికానికి చేతులెలా వచ్చాయ్. మొజాంబిక్ లో 50 మంది తలలు నరికిన ఉగ్రవాదులు
మొజాంబిక్ దేశం అతి క్రూర చర్యకు వేదికైంది. రెచ్చిపోయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూక ఘోరాతి ఘోరంగా 50 మంది పౌరుల తలలు నరికేసింది. రెండు రోజులపాటు ఈ మారణ కాండ కొనసాగించింది. ఈ పాశవిక సంఘటన గురించి విని ప్రపంచం మొత్తం నివ్వెరబోతోంది. మనం ఇంకా ఇంకా ఇటువంటి ప్రపంచంలోనే ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో ఈ నరమేధం సాగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఈ మారణకాండ జరిగినట్లు తెలియజేసింది. ఉగ్రవాదులు దాడిలో దాదాపు 50 మంది గ్రామస్తుల తలలు తెగనరకడంతోపాటు, మహిళలను అపహరించారని మీడియా తెలిపింది. శుక్రవారం రాత్రి నంజబ అనే గ్రామంలోకి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేసే ఉగ్రవాదులు ప్రవేశించారు. ముందుగా వారు గ్రామానికి చెందిన ఇద్దరి తలలు నరికి, వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేశారని, ఉగ్రవాదులు ‘అల్లాహు అక్బర్’ అంటూ అరుచుకుంటూ, కాల్పులు జరుపుతూ గ్రామాల్లో ప్రవేశించినట్లు గ్రామీణులు తెలిపినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు గ్రామస్తులు కిరాతకంగా తెగ నరకడం తో పాటు, ఇళ్లను కూడా కాల్చివేశారు. గ్రామంలో ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి 50 మందికిపైగా ప్రజలను లాక్కెళ్లి, వారి తలలను తెగనరికి, వారి శరీరాలను ఛిద్రం చేశారు.
ఉగ్రవాదులను చూసి ప్రాణభయంతో పారిపోతున్న వారిని కూడా ముష్కరులు వదల్లేదని వారిని వెంటాడి మరీ చంపారని మీడియా పేర్కొంది. ఆ దేశంలో 2017 నుంచి ఇటువంటి దాడులు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2,000 మందికి పైగా సామాన్య ప్రజలు తీవ్ర వాదుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 లక్షల మంది నిరాశ్రయులుగా మారిపోయారని గ్రామీణులు వెల్లడించినట్లు ఆ మీడియా కథనం లో ప్రచురితమైంది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ప్రత్యేక పాలన సాగించేందుకు ఉగ్రవాదసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుండటంతో దీనిని ఆసరాగా చేసుకుని, అక్కడి ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చడంతో పాటు తమ ప్రత్యేక పాలన ప్రారంభించేందుకు ఉగ్రవాద సంస్థలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి.