కరోనాతో ఇండియాలో 40 లక్షల మరణాలా?
కరోనా కల్లోలం దేశాన్ని ఎంతటి వినాశనంలోకి తీసుకెళ్లిందో అందరం చూశాం. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగం వినిపించింది. ఆస్పత్రుల్లో శవాల కుప్పలు కనిపించాయి. శ్మశానాల్లో అనాథ శవాలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్.వో) చేసిన ప్రకటనపై కేంద్రప్రభుత్వం ఖండించింది. మండిపడింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్.వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది.
జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పుపట్టింది. తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే భౌగోళికంగా.. జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని కేంద్రప్రభుత్వం పేర్కొంది.
కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై భారత ప్రభుత్వం స్పందించింది.
ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్.వో అంచనావేసింది. దీంతో భారత్ లోనూ మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని లెక్కగట్టింది.డబ్లూ.హెచ్.వో గణాంకాలను తప్పుపట్టడం లేదని.. ఇందుకు అనుసరించిన విధానంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది.
130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదని.. భారత్ నమూనాను ఖచ్చితత్వంతో కూడుకుందని కేంద్రం స్పష్టం చేశారు. చిన్నస్థాయిలో శాంపిల్ సైజు ఆధారంగా కరోనా మరణాలను అంచనావేయడం ట్యూనీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందన్నారు.
ఇక చైనా, బంగ్లదేశ్, ఇరాన్, సిరియా సైతం కరోనా మరణాల లెక్కింపునకు డబ్ల్యూ.హెచ్.వో అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి.