న్యూ ఇయర్ ఎఫెక్ట్ .. ఒక్క రాత్రి లో ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులంటే ..!
నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉత్సవాల్లో జోష్ నింపడానికి ప్రజలు భారీగా మద్యం కొనుగోళ్లకు ఎగపడ్డారు. అదేవిధంగా తాగి వాహనాలు నడిపిన వారి సంఖ్య కూడా పెరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31 అర్ధరాత్రి పోలీసులు రాష్ట్ర వ్యాప్తం గా పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాగి ఎవరైనా వాహనం నడిపితే, వారిపై కేసు నమోదు చేయడంతోపాటు, భారీ జరిమానాను విధిస్తామని , అంతేకాక వారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తామని, మద్యం సేవించిన వారు ఇళ్లకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ముందు నుండే హెచ్చరించారు. ఒకవేల డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
అయినప్పటికీ కూడా పోలిసుల మాటలని చాలామంది అసలు లెక్క లోనే పెట్టుకో లేదు. అది ఎలా తెలిసింది అంటే ..డిసెంబర్ 31 అర్ధరాత్రి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారిపై నమోదు చేసిన కేసులని ఒకసారి చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 239 చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,148 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అత్యధికంగా 1,824 కేసులు నమోదు కావడం విశేషం.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో 873 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సమాచారం.