23.5 కోట్ల మంది యూజర్ల డేటా లీక్..!
ఇంటర్నెట్ ప్రపంచంలో నెటిజన్ల డేటాకు అసలు రక్షణే కరువైపోతుంది. యూజర్లు ఉపయోగించే అనేక సర్వీస్ లలోని వారి డేటా ఎప్పటికప్పుడు లీకవుతూనే ఉంది. కొద్దిరోజుల ముందు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ యూజర్ల డేటా పలు మార్లు లీక్ అవ్వగా , తాజాగా ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్, టిక్ టాక్ యూజర్ల డేటా లీకైంది. మొత్తంగా దాదాపుగా 23.5 కోట్ల మంది యూజర్ల డేటా లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్, టిక్ టాక్ యూజర్లకు చెందిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పేర్లు, ఫోన్ నంబర్స్ , ఫోటోలు ఇతర వివరాలు లీకైనట్టు తెలుస్తుంది.
ఈ డేటాను డీప్ సోషల్ అనే కంపెనీ లీక్ చేసినట్లు తెలుస్తోంది. హాంగ్ కాంగ్ కు చెందిన సోషల్ డేటా అనే కంపెనీకి డీప్ సోషల్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సోషల్ డేటా స్పందించింది. డేటా లీక్ అయినట్టు వస్తున్న వార్తలు నిజమే అని, కానీ డేటాను సేకరించడాన్ని ప్రస్తుతం ఆపేశామని ఆ కంపెనీ తెలిపింది. అయితే నిజానికి ఇంటర్నెట్‌లో పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండే డేటాను సేకరించడం తప్పేమీ కాదని, అది హ్యాకింగ్ కిందకు రాదని సోషల్ డేటా చెప్తుంది. కాగా ఇలా సేకరించిన డేటాను ఫిషింగ్ వంటి స్కాంలకు ఉపయోగిస్తారు. అందువల్ల ఈ విషయం నెటిజన్ల భద్రతకు ముప్పును కలిగిస్తుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా , గతంలోనూ ఫేస్ బుక్ సంస్థ కూడా ఈ తరహా ఆరోపణలను ఎదుర్కొంది. యూజర్ల డేటాను ఇతర కంపెనీలు చోరీ చేస్తున్నా ఫేస్‌బుక్ పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో అలాంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ తరువాత యూజర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. ఇప్పుడు తాజాగా మళ్లీ నెటిజన్ల డేటా లీక్ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా డేటా లీక్ అవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.