నితీష్ ను సీఎం చేస్తే 20 మంది ఎంఎల్ఏలు జంప్ ?
బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాకుండానే బీజేపీలో నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్దీయే కూటమిగా బీజేపీ+జేడీయుతో పాటు మరో రెండు పార్టీలు పనిచేశాయి. అయితే కూటమిలో బీజేపీ, జేడీయులే ప్రధానమైనవి. 243 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లకు జేడీయూ 115 స్ధానాల్లోను పోటీ చేశాయి. అయితే ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎక్కువ సీట్లలో పోటీ చేసినా, గెలిచినా తమ సీఎం అభ్యర్ధి మాత్రం నితీష్ కుమారే అంటూ బీజేపీ అగ్రనేతలు బహిరంగంగానే ప్రకటించారు.
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోతోందని సమాచారం. 115 సీట్లకు పోటీ చేసిన జేడీయు గెలిచింది 43 మాత్రమే. ఇక 110 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 73 స్ధానాల్లో గెలిచింది. ఇక్కడే సమస్యంతా మొదలైందట. జేడీయుకన్నా దాదాపు ఎక్కువ సీట్లలో గెలిచిన తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ నే ఎందుకు సీఎం చేయాలంటూ బీజేపీ ఎంఎల్ఏల్లో కొందరు అడ్డం తిరిగారట.
నితీష్ ను సిఎంగా చేసేట్లయితే తాము పార్టీలో నుండి బటయకు వెళిపోతామనే బెదిరింపులకు దిగినట్లు ప్రచారం మొదలైంది. ఎట్టి పరిస్ధితుల్లోను నితీష్ ను సిఎంగా అంగీకరించేది లేదని పార్టీ అగ్రనేతలకు ఆ 20 మంది ఎంఎల్ఏలు తెగేసి చెప్పారట. తమ ఆలోచనలకు భిన్నంగా బీజేపీ నితీష్ నే సీఎంగా ప్రకటిస్తే తాము ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కు మద్దతు ఇవ్వటానికి కూడా వెనకాడేది లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారట. దాంతో బీహార్ రాజకీయంలో టెన్షన్ మొదలైంది.
నిజానికి ఎన్డీయే అతికష్టం మీద విజయం సాధించిందనే చెప్పాలి. నితీష్ మీ ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రధానమంత్రి నరేంద్రమోడి, బీజేపీ నేతల ఎలక్షనీరింగ్ కారణంగానే కూటమి గట్టెక్కింది. పైగా నితీష్ గడచిన 30 ఏళ్ళల్లో ఎప్పుడూ ఎంఎల్ఏగా పోటీ చేసిందే లేదు.15 ఏళ్ళు గా సీఎంగానే ఉంటున్న నితీష్ ఎంఎల్సీ సభ్యుడి హోదాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా కొందరు బీజేపీ ఎంఎల్ఏలు ఎత్తి చూపుతున్నారట. కనీసం ఎంఎల్ఏగా కూడా పోటీ చేయని వ్యక్తికి తామెందుకు మద్దతుగా నిలబడాలని లాజిక్ మాట్లాడుతున్నారట. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి నితీష్ కు సీఎం కుర్చీ దూరమైన ఆశ్చర్యపోవక్కర్లేదన్నట్లుగా మొదలైంది పరిణామాలు. మరి ఏమవుతుందో చూడాల్సిందే.