ఈ టీనేజర్ చేస్తున్న సాహసం తెలిస్తే దిమ్మ తిరిగిపోవటం ఖాయం
పందొమ్మిదేళ్ల వయసులో ఏం చేస్తారు? సీరియస్ గా చదివే వాళ్లు కొందరైతే.. చదువుతూనే.. కెరీర్ లో బాగా సెటిల్ అయ్యేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించేవారు మరికొందరు ఉంటారు. ఈ రెండింటి కంటే కూడా.. హాయిగా చదువుకుంటూ.. స్నేహితులతో ఎంజాయ్ చేసే వారు ఉంటారు. వీటన్నింటికి మించి.. ఊహకు వచ్చినంతనే చెమటలు పట్టే సాహసాన్ని చేసే ప్రయత్నం చాలా చాలా తక్కువ మంది చేస్తుంటారు. తాజాగా అలాంటి ప్రయత్నాన్ని చేస్తోంది పందొమ్మిదేళ్ల జారా రూథర్ ఫోర్డ్.
బెల్జియన్ బ్రిటిష్ యువతికి విమనాన్ని నడపవటం చాలా సరదా. అదేం పెద్ద విషయం కాదు కదా? అంటారా? నిజమే.. అయితే.. ఆమె విమానాన్ని నడుపుతారు. కాకుంటే ఒంటరిగా.. తన సొంత ఫ్లెయిన్ లో అలా తిరుగుతుంటారు. అంతేకాదు.. సాహస యాత్రలు ఆమెకు చాలా ఇష్టం. తాజాగా ఆమె భారీ టార్గెట్ఒకటి పెట్టుకున్నారు. ఐదు ఖండాల్లో.. 52 దేశాల మీదుగా ప్రపంచ యాత్రను చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం తన షార్క్ స్పోర్ట్ మోడల్ విమానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచాన్నిచుట్టేసిన రికార్డు కోసం ఆమె ఇప్పటికే తన ప్రయాణాన్ని మొదలు పెట్టేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు 30 ఏళ్ల పాయోెస్టా వయిజ్ పేరుతో ఉంది. అమెరికాకు చెందిన ఆ మహిళ రికార్డును బద్ధలు కొట్టటమే లక్ష్యంగా ఈ టీనేజర్ పెట్టుకుంది.
ఇందులో భాగంగా బెల్జియంలోనికొర్ట్రిజ్క్ లో ఒక చిన్న ఎయిర్ డ్రోమ్ నుంచి ఆమె తన సాహసయాత్రను షురూ చేశారు. మరో విచిత్రమైన విషయం ఏమంటే.. ఆమె సాహస యాత్రకు ప్రకృతి సైతం భయపడినట్లుంది. అందుకే కాబోలు.. ఆమె తన ప్రయాణాన్ని షురూ చేసే సమయంలో ఈదురు గాలులు.. ఆకాశం మేఘాలతో నిండిపోయిన ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ.. ఆమె తన ప్రయాణాన్ని అనుకున్న టైంకు ప్రారంభించేందుకు ఏ మాత్రం వెరవలేదు. తల్లిదండ్రులు.. స్నేహితులు ఆల్ ద బెస్ట్ చెబుతున్న వేళ.. ఆమె తన వరల్డ్ టూర్ ను షురూ చేసింది. ఒక సీటు ఉన్న విమానంలో 52 దేశాల్ని చుట్టి రానుంది. సుమారు 52వేల కిలోమీటర్లు ఈ ట్రిప్ లో ఆమె ప్రయాణిస్తారని చెబుతున్నారు. ఈ సాహస టీనేజర్ కు హ్యాపీ జర్నీ చెబుదాం.