160 కోట్ల మందికి షాకిచ్చేలా స్పాట్ పెట్టిన కరోనా?
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఎంతలా అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిమిషం ఖాళీ లేకుండా పరుగులు పెట్టేస్తున్న ప్రపంచ ప్రజలకు లాంగ్ లీజర్ ఇచ్చేయటం తెలిసిందే. కలలో కూడా అనుకోని ఎన్నింటినో కళ్ల ముందుకు తీసుకొచ్చిన కరోనా.. పేదలకే కాదు కష్టపడి పని చేసే వారి కడుపు మీద కూడా కొట్టనుందన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. కరోనాతో కష్టాలే కాదు.. ఎన్నెన్ని అద్భుతాల్ని మీ జీవితాల్లోకి తీసుకొచ్చిందో చూశారా? అంటూ కొందరు వాట్సాప్ లలో పోస్టుల పెడుతున్నారు. అయితే.. అలాంటి వాటిని ఎంజాయ్ చేయటానికి కనీస ఉద్యోగ భద్రత చాలా అవసరం. కానీ.. అందుకు భిన్నమైన వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుందన్న విషయాన్ని తాజాగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ వో) పేర్కొంది.
సదరు సంస్థ అంచనాల ప్రకారం కరోనా కారణంగా 160 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్సు తో చూస్తే.. ఈ సంఖ్య సగమని చెబుతోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రభావం ఎక్కువగా అమెరికా.. యూరప్.. మధ్య ఆసియాలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 30 కోట్ల మంది ఫుల్ టైం ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 43.6 కోట్ల చిన్న.. పెద్ద కంపెనీలు మూతపడనున్నాయని చెప్పారు. అందులో 23.2 హోల్ సేల్.. 11.1 కోట్ల రిటైల్ పరిశ్రమలు ఉండనున్నాయని.. ఫుడ్ సర్వీస్.. రియల్ ఎస్టేట్ రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమైనా రానున్నరోజులు అంత సౌకర్యవంతంగా..సుఖంగా ఉండే అవకాశమే లేదని చెప్పక తప్పదు. ప్రపంచం మొత్తం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అన్న పరిస్థితే ఉంటుందని చెప్పక తప్పదు.