పుట్టింటికి వెళుతూ భర్తను చంపేసిన లావణ్య ప్లాన్ బయటకు

ప్రియుడి మోజు.. భర్త పెడుతున్న ఇబ్బంది.. వెరసి సుపారి ఇచ్చి మరీ చంపేయించిన భార్య వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2026-04-18 04:10 GMT

ప్రియుడి మోజు.. భర్త పెడుతున్న ఇబ్బంది.. వెరసి సుపారి ఇచ్చి మరీ చంపేయించిన భార్య వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వారం మొదట్లో పరకాలలో చోటు చేసుకున్న ఒక హత్యకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేధించారు. భర్తను అడ్గు తొలగించుకోవటానికి నగల్ని కుదవ పెట్టి.. ఆ డబ్బుల్ని సుపారీగా ఇచ్చి భర్తను మర్డర్ చేసిన వైనం వెలుగు చూసింది. తాజాగా ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాల్ని పోలీసులు బయటపెట్టారు.

అసలేం జరిగిందంటే.. పరకాలకు చెందిన సుమన్ భరత్ కు 2013లో లావణ్యతో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరకాల పట్టణానికి చెందిన నరేష్ తో లావణ్యకు పరిచయమైంది. అది కాస్తా.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్తకు తెలీడంతో భార్యను పలుమార్లు మందలించాడు. నిత్యం మద్యం తాగి వచ్చిన లావణ్యను కొట్టేవాడు.

దీంతో తన సోదరుడు రాజు, ప్రియుడు నరేష్ తో కలిసి భర్తను చంపేసే దారుణ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా అక్కా.. తమ్ముళ్లు ఇద్దరు కలిసి నరేష్ కు.. ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్లేదు.. భర్త/బావను చంపేయాలని ప్రియుడు నరేష్కు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన నరేష్.. గోవిందరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లుతో హత్య గురించి ప్లాన్ చేసి... రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. లావణ్య తన బంగారాన్ని కుదువపెట్టి రూ.1.59 లక్షలు.. తమ్ముడు నరేష్ రూ.2 లక్షలు.. ప్రియుడు రాజు రూ.లక్ష కలిపి మొత్తం రూ.4.59 లక్షలు వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.

వెంకటేశ్వర్లు తన స్నేహితులైన రాకేశ్ తో ఈ హత్య గురించి మాట్లాడాడు. డబ్బులు ఆశ చూపించి ములుగుకు పిలిపించాడు. అనంతరం తాము వేసుకున్న ప్లాన్ ప్రకారం సుమన్ భరత్ ను మద్యం తాగేందుకు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి..భారీగా తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత వెంకటేశ్వర్లు బీరు సీసాతో భరత్ తల మీద బలంగా కొట్టటటంతో అక్కడికక్కడే కూలిపోయాడు. అప్పటికే రెఢీగా ఉన్న పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

తాము చేసిన ఈ దారుణాన్ని వీడియోగా తీసి.. సుమన్ భరత్ ను హత్య చేసిన వైనాన్ని లావణ్యకు చెప్పారు. వీడియోను.. ఫోటోలను చూపించారు. అనంతరం మిగిలిన బ్యాలెన్సు మొత్తాన్ని ఇచ్చేసింది లావణ్య. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లిన లావణ్య.. చిన్న ఆస్థికలు.. బూడిద.. సిగరెట్ పీకలు.. బీరు సీసాలు సంచిలో వేసుకొని పక్కనున్న కాల్వలో పడేశారు. పోలీసులు తాజాగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. సుమన్ భరత్ తండ్రి తన కొడుకు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. లావణ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో.. జరిగిన మొత్తాన్ని చెప్పేసింది.దీంతో.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇదంతా చదివిన తర్వాత.. ఇదేంది లావణ్య అన్న మాట అనుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News