బాబుకు టచ్లో లేని 16 మంది ఎమ్మెల్యేలు వీరే!

Update: 2019-02-19 15:30 GMT
తెలుగుదేశం పార్టీ నుంచి వలసల బాట కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకూ పార్టీని ముగ్గురు ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎంపీలు వీడారు.  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గిన వీళ్లు తమ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీల వైపు వెళ్లిపోయారు. వీరిలో ఒక్కరు మాత్రమే జనసేనలోకి వెళ్లారు. మిగతా వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇంకా మరింతమంది నేతలు తెలుగుదేశం పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఆ జాబితా పెద్దదే అని ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది టచ్ లో ఉన్నారని.. వారిలో అందరికీ జగన్ అవకాశాలు ఇవ్వడం లేదని..దీంతో వైసీపీలోకి వలస వెళ్లాలనుకునే  వాళ్లకు కూడా ఇప్పుడు అవకాశాలు దక్కడం లేదని సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నేతలు చంద్రబాబుకు అయితే టచ్ లో లేరట. ఏకంగా పదహారు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం అధినేతకు టచ్లో లేకుండా పోయారని సమాచారం. వారి జాబితా ఇలా ఉంది…

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి.. గుండ లక్ష్మి దేవి - కలమట వెంకట రమణ మూర్తి - విజయనగరంలో కిమిడి మృణాళిని - కొళ్ల లలిత కుమారి - విశాఖ జిల్లాకు సంబంధించి పీలా గోవింద సత్యనారాయణ - వంగలపూడి అనిత - ఈస్ట్ గోదావరి నేతలు గొల్లపల్లి సూర్యారావు - పలపర్తి నారాయణ మూర్తి - బూరుగు పల్లి  శేషా రావు - పెందుర్తి వెంటేష్ - వేగుళ్ల జోగేశ్వరరావు - పూలపర్తి రామాంజనేయులు - వెస్ట్ కు సంబంధించి  గన్ని వీరాంజనేయులు - ముప్పిడి వెంకటేశ్వరరావు - వెటుకూరి వెంకట శివరామ రావు - గుంటూరు నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి..వీళ్లంతా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి టచ్లో లేకుండా పోయారని సమాచారం. 
Tags:    

Similar News