సెల్ఫ్ కంట్రోల్ లేకే సెల్ఫీలపై కంట్రోల్
సోషల్ మీడియా ఫీవర్ తో యువత సెల్ఫీలపై తెగ మోజుపడుతున్న సంగతి తెలిసిందే. పర్యాటక ప్రాంతాలు, ఇతర విశేషాలు, అద్భుతాల వద్ద సెల్ఫీల వద్ద దిగుతూ ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్న యువత ఒక్కోసారి వీరోచిత సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాలే రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సెల్ఫీలపై నియంత్రణకు నిబంధనలు కఠినం చేసింది. పర్వత శిఖరాలు, ఎత్తయిన కట్టడాలు, రైళ్లు పైకి ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారిని చూసి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. నో సెల్ఫీ జోన్లు ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని నిర్ణయించింది. ఇటీవల ముంబయిలోని బాంద్రా వద్ద సెల్ఫీలు దిగుతూ ముగ్గురు అమ్మాయిలు సముద్రంలో మునిగిపోయిన ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో ముంబయి పోలీసులు యాక్షన్ లోకి దిగారు. యువత సెల్ఫీలు దిగేందుకు అనుమతి లేని ప్రాంతాలను గుర్తించాలని మహా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు అలాంటి ప్రాంతాలను గుర్తిస్తున్నారు.
ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మిగతా రాష్ట్రాలకూ ఆదర్శం కానున్నాయి. ఈ నిబంధనలు గట్టిగా అమలైతే సెల్ఫీల మోజులో ప్రాణాలు పోగొట్టుకోవడం తగ్గుతుంది. అన్ని రాష్ట్రాలూ ఇలాంటి నో సెల్ఫీ జోన్లు ఏర్పాటుచేసే ఆస్కారం ఉంది.