బంగ్లాదేశ్ లో పేలిన గ్యాస్ పైపు లైన్.. 11 మంది మృతి !
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో ఓ గ్యాస్ పైప్ లైన్ పేలింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. నారాయణగంజ్ లోని బైతుస్ సలాత్ జామే మసీదు వద్ద ఉన్న గ్యాస్ పైప్ లైన్ శుక్రవారం రాత్రి పేలినట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న మసీదులోని ఆరు ఏసీలు కూడా పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 37 మంది ముస్లింలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఒక బాలుడు ఉన్నాడు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ప్రమాదస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ పైప్ లైన్ పేలుళ్ల ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.