ఆ పాపను బతికించేందుకు 1000కి.మీ దూరంలోంచి విమానంలో తల్లిపాలు
ఈ ప్రపంచంలో కల్తీలేనిది.. స్వచ్ఛమైనది తల్లిపాలు ఒకటే. అదే పుట్టిన బిడ్డకు సంపూర్ణ పౌష్టికాహారం అని వైద్యులు చెబుతుంటారు. ఆధునిక కాలంలో మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చి పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వని దైన్యం నెలకొంది. కానీ ఆ తల్లి మాత్రం తన బిడ్డను బతికించేందుకు 1000 కి.మీల దూరంలో ఉన్న కూడా రోజూ విమానంలో తల్లిపాలను పంపిస్తోంది. సీరియస్ గా ఉన్న బిడ్డ బతకాలని కోరుకుంటోంది.
లఢఖ్ రాష్ట్రంలోని లేహ్ లో ఇటీవలే ఓ తల్లికి పెద్దాపరేషన్ చేసి డాక్టర్లు పురుడు పోశారు. అయితే నెలరోజులు కూడా నిండని ఆ పసిపాపకు శ్వాస, ఆహార నాళాలు అతుక్కొని జన్మించింది. వెంటనే ప్రత్యేక సర్జరీ అవసరమని లేహ్ వైద్యులు సూచించడంతో లేహ్ కు 1000 కి.మీల దూరంలోని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చిన్నారిని తరలించి ఆపరేషన్ చేయిస్తున్నారు.
అయితే తల్లిని కూడా రోడ్డు మార్గంలో తరలించాలనుకున్నా ఆమెకు సిజేరియన్ కావడంతో ఆమె ఢిల్లీకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దాంతో తల్లికి విమానంలో పాలను తరలిస్తున్నారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా రోజు ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా?
లేహ్ ఎయిర్ పోర్టులో పాప తండ్రి స్నేహితుడు పనిచేస్తున్నాడు. అతడికి తల్లి పాలు రోజు తీసుకొచ్చి బంధువులు ఇస్తే.. అతడు విమాన సిబ్బంది ద్వారా ఆ పాలను ఢిల్లీకి పంపిస్తున్నాడు. అలా విమానాశ్రయంలో తండ్రి ఆ టైంకు ఎదురుచూస్తూ తల్లిపాలను బిడ్డకు అందిస్తున్నారు.రోడ్డు మార్గంలో పంపిస్తే చెడిపోతాయి కాబట్టి ఇలా విమానంలో అందిస్తున్నారు. ఇలా ఫ్రీగానే తల్లిపాలు లేహ్ నుంచి 1000 కి.మీల దూరంలో ఉన్న బిడ్డకు అందుతున్నాయి. ప్రస్తుతం పాప కోలుకుంటోందని.. వచ్చేవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.
ఒక పాపను బతికిచేందుకు ఇలా 1000 కి.మీలు తల్లిపాలను తరలిస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.