గోదావరి అల్లుడా మజాకానా! 10వేల కేజీల స్వీట్లు.. వంద అరటి గెలలు

Update: 2021-08-13 04:39 GMT
పడే సాహసం ఎవరూ చేయలేరు. మర్యాదలకు తెలుగు నేత కేరాఫ్ అడ్రస్ అయినా.. మర్యాదల విషయంలో ఏ మాత్రం తగ్గని తీరు గోదావరి ప్రాంతానికి చెందిన ఏపీలోని రెండు జిల్లాల్లో భారీగా కనిపిస్తూ ఉంటుంది. గోదారోళ్ల సారె గోదారంత అన్న మాటకు ఏ మాత్రం తీసిపోని తాజా ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక కొత్త అల్లుడు.. శ్రావణమాసం సందర్భంగా అత్తారింటికి వెళ్లే వేళలో.. తనతో పాటు తీసుకెళ్లిన సారె వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చాలామంది నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి.

కొద్ది రోజుల క్రితం ఒక వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఆషాఢం వేళ వియ్యాలవారు పంపిన సారె అప్పట్లో అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో పెళ్లి వైభవంగా జరిగింది. గత నెలలో ఆషాడ మాసం రావటంతో అల్లుడింటికి మామగారి ఇంటి నుంచి సారె కావిళ్లను భారీగా పంపారు.

అప్పట్లో వారు పంపిన సారెను చూసి అందరూ అవాక్కు అయ్యారు. ఊరేగింపుగా పంపిన భారీ సారె.. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. స్టీలు బిందెల్లో 50 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా, 200 ఆవకాయ జాడీలు,10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు పంపారు. తెలుగు నాటనే కాదు.. పక్క రాష్ట్రాల్లోనూ ఈ సారెకు సంబంధించిన వీడియో భారీగా షేర్ అయ్యింది.

ఆషాడం పోయి శ్రావణం వచ్చిన వేళ.. అత్తారింటికి వెళ్లే కొత్త అల్లుడు తనతో పాటు తీసుకెళ్లే సారెను మరింత ఘనంగా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఏకంగా 10వేల కేజీల స్వీట్లు కావిడిని పంపారు. అంతేకాదండోయ్.. వంద అరటి గెలలతో సహా మొత్తం ఐదు డీసీఎంలలో పది టన్నుల బరువున్న 20 రకాల స్వీట్లను సారెగా పంపారు. ఒకరి సారెకు మించినట్లుగా ఉన్న వియ్యపువారి సారె ఇప్పుడు తెలుగునాట మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గోదారోళ్లంటే అంతేమరి. వారి మర్యాదను కొలిచే సాహసం ఎవరు మాత్రం చేయగలరు?


Full View
Tags:    

Similar News