వాటర్ ట్యాంక్ లో 10వేల అక్రమ మద్యం బాటిల్స్… తెలంగాణ టు ఏపీ !
ఏపీలో అక్రమ మద్యం రవాణా రోజురోజుకి పెరిగిపోతుంది. ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా దారులు పక్క రాష్ట్రం నుండి తక్కువ ధరకి తీసుకువచ్చి , ఏపీలో అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. దీనికి అధికారులు చెక్ పెట్టాలని ఎంతగా చూస్తున్నప్పటికీ కూడా అది కుదరడంలేదు. అక్రమ మద్యం రవాణా దారులు రోజుకొక రీతిలో మద్యం దందా కొనసాగిస్తున్నారు. కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు గుర్తించారు.
ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదానికి పూనుకున్న ప్రభుత్వం .. దశల వారీగా మద్యాన్ని రాష్ట్రం నుండి పారదోలాలని వ్యూహాన్ని సిద్ధం చేసింది. అందులో భాగంగానే మద్యం ధరలు భారీగా పెంచింది. అయితే , ఇది అక్రమ మద్యం రవాణా దారులకి మంచి అవకాశంగా మారింది. రాష్ట్రంలో ధరలు భారీగా పెరగడంతో పక్క రాష్ట్రాల నుండి భారీగా మద్యం రాష్ట్రంలోకి వస్తుంది. అధికారులు ఎంత నిఘా పెడుతున్నప్పటి కూడా అక్రమ మద్యం రాష్ట్రంలోకి రావడం మాత్రం ఆపడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ధరలు కూడా తగ్గించింది. కానీ , ఇంకా అక్రమ మార్గాలలో మద్యం రవాణా అవుతూనే ఉంది. అక్రమ మద్యం పట్టుబడుతూనే ఉంది .
ఇక తాజాగా పెద్ద వాటర్ ట్యాంక్ లో భారీగా తెలంగాణా మద్యం పట్టుబడింది .అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుకున్నట్టు ఎస్ఈ బీ అధికారులు చెప్పారు. వాటర్ ట్యాంకులో దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మద్యం దాచిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఏకంగా కొరియర్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమ మద్యం దందా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా పోలీసుల కళ్లుగప్పి లిక్కర్ మాఫియా రేచ్చిపోతూనే ఉంది. ఎస్ ఈ బీ అధికారులు లిక్కర్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక వారికి సహకరించే అధికారులను కూడా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇటీవల పలువురు పోలీసులపై , ఎస్ ఈ బీ అధికారులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.