న్యూయార్క్ మేయర్ రేసులో భారతీయ దర్శకురాలి కుమారుడు.. ఎవరీ మమ్ దానీ?

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతలు పలు స్థానాల్లో కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-06-12 10:30 GMT

అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతలు పలు స్థానాల్లో కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు.. జోహ్రాన్ క్యామి మమ్ దానీ.. న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఈ మేయర్ పదవికి పోటీ పడుతున్న రేసులు దూసుకుపోతున్నారని అంటున్నారు.

అవును... డెమోక్రటిక పార్టీ సభ్యుడైన మమ్ దానీ ప్రస్తుతం న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. ఈ సమయంలో త్వరలో జరగబోతున్న న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ పదవికి పోటీ పడుతున్న మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో కు మమ్మ్ దానీ గట్టి పోటీ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో.. ఆండ్రూ కౌమోను మమ్ దానీ ఓడించడం ఖామని ధీమాగా చెబుతున్నారు.

ఈ క్రమంలో... ప్రస్తుతం నిధుల సేకరణ, నూతన ఆలోచనలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నారు మమ్మ్ దానీ. ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరిగి మమ్‌ దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్‌ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్‌ గా, తొలి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌ గా చరిత్ర సృష్టిస్తారు.

జోహ్రాన్ మమ్ దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తండ్రి మహ్మూద్ మమ్ దానీ కాగా తల్లి మీరా నాయర్. మహ్ముద్ మమ్ దానీ ఉగాండాలో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్ కు ఏడేళ్ల వయసున్నప్పుడు వీరు అమెరికాలోని న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో జోహ్రాన్ కు 2018లో అమెరికా పౌరసత్వం లభించింది.

ఇక.. బ్రాంక్స్ హైస్కూల్ ఆఫ్ సైన్స్ తో పాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన జోహ్రాన్.. కాలేజీలో ఉన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, స్థానికంగా సేవా కార్యక్రమాల్లో వాలంటీర్ గా సేవలందించేవాడు. ఈ క్రమంలోనే 2017లో డెమోక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరి యాక్టివ్ గా మారారు!

ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. ఇక.. షియా ముస్లిం మతస్తుడైన జోహ్రాన్... సిరియాలో జన్మించిన రమా దువాజీని ఇటీవలే వివాహం చేసుకున్నారు.

కాగా... జోహ్రాన్ మమ్ దానీ తల్లి మీరా నాయర్ ఒడిశాలో జన్మించారు. ఈ క్రమంలో మీరాబాయి ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మాన్ సూన్ వెడ్డింగ్, కామసూత్ర, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు.

Tags:    

Similar News